జమ్మలమడుగు, కడప జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రమంతా తెలుసు ఈ పేరు కరడు గట్టిన ఫ్యాక్షన్ కి పెట్టిన పేరు ఈ జమ్మల మడుగు అంటారు రాయసీమ చరిత్ర తెలిసినవాళ్లు. 


దేవగుడి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రెండు వర్గాలుగా తరాల నాటి నుంచి వైర నడిపినది, ఈ జమ్మలమడుగు అడ్డాగానే.  జగన్ కుటుంబంలోని మనిషి చనిపోయినపుడు కూడా ఈ జమ్మలమడుగు పేరే గట్టిగా వినిపించిందంటారు.  మొట్టమొదటి సారిగా.. దేవగుడి కుటుంబం రామ సుబ్బారెడ్డి కుటుంబం కలిసి ఒకరు శాసన సభ ఎమ్మెల్యే, మరొకరు లోక్ సభ ఎంపీగా పోటీ ఒకే పార్టీ తరుపున చేయడమే ఒక విశేషంగా చెప్పుకుంటున్నారీ జమ్మలమడుగు ప్రజలు.


ఈ రెండు ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబాలు జమ్మలమడుగు లో ప్రజాస్వౌమికంగా ఎన్నికలు జరగనివ్వవు.. ఎన్నికల పోలింగ్ నాటికి చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తారని నోటిఫికేషన్ కు ముందునుంచే నెత్తీనోరు కొట్టుకుంటూ మొర పెట్టుకున్నారు వైసీపీ నాయకులు.


వైసీపీ నాయకులు భయపడినట్లుగానే..జమ్మలమడుగులలో ఎన్నికల పోలింగ్ కి ఫ్యాక్షన్ ఇబ్బందులు ఎదురువుతున్నాయంటే  అవునంటున్నారు వైసీపీ లోక్ సభ ఎంపీ సుధీర్ రెడ్డి.  కొన్ని చోట్ల పోలింగ్ జరగకుండా తెదేపా వారు అడ్డుకుంటున్నాని వారి ఆరోపణ.


ఎన్నికల ప్రశాంతంగా జరిగి ప్రజలు వారి..ఇష్టానుసారంగా నాయకులును ఎన్నుకకుంటేనే ప్రజాస్వౌమ్యం పరిడవెల్తలుతుంది. అలానే జరగాలని ఆశిస్తున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: