జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజా ఎన్నికల్లో గెలిచి గట్టెక్కేనా? ఆయనను ప్రజలు తమ ఓటు ద్వారా దీవిస్తా రా? లేక పక్కన పెడతారా? ఇప్పుడు ఈ ప్రశ్న అన్ని వర్గాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది. 2014లోనే పార్టీ పెట్టిన పవన్‌.. అప్పటి ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ సాధ్యమైన న్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. పార్టీ అధినేతగా పవన్‌ కూడా ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అది కూడా తన సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గాలను ఆయన ఎంపిక చేసుకోవడం గమనార్హం. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్‌ పోటీకి దిగారు. 


వాస్తవానికి పార్టీ అధినేతలు ఒకటి నుంచి రెండు చోట్ల పోటీ చేయడం గతంలోనూ ఉంది. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లు సహా తిరుపతి నుంచి కూడా 2009లో పోటీ చేశాడు. అనూహ్యంగా ఆయన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇక, తిరుపతి నుంచి విజయం సాధిం చారు. గతంలో ఎన్టీఆర్‌ కూడా ఇదే తరహా పోటీ చేసి విజయం సాధించారు. ఇక, ఇప్పుడు పవన్‌ కూడా రెం డు స్థానాల నుంచి పోటీకి దిగారు. గాజువాక, భీమవరం. అయితే, వపన్‌ అనుకున్న అంచనాలు రీచ్‌ అయితే.. ఓకే.. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో పవన్‌ను నమ్మలేం అంటున్నారు పరిశీలకులు. 


పవన్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన డిమాండ్‌ రాజకీయ రిజర్వేషన్‌, బీసీల్లో చేర్చడం అనే విషయాలపై పవన్‌కు ఇప్పటికీ క్లారిటీ లేదు. పైగా ఆయన ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టింది కూడా లేదు. ఇక, కాపులు గుర్రుగా ఉన్న టీడీపీతో లోపాయి కారీ ఒప్పందం చేసుకున్నారని, అధికార పక్షాన్ని టార్గెట్‌ చేయాల్సిన పవన్‌.. ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడంపైనా విమర్శలు ఉన్నాయి. ఇక, ప్రతి విషయంలోనూ పెద్దగా హామీలు ఇవ్వలేక పోయారని, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమరావతిపైనా, పోలవరంపైనా పవన్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేక పోయారని అంటున్నారు. 


ఇక పోల్ డేకు ముందు రోజు చాలా వ‌ర‌కు చేతులు ఎత్తేసిన ప‌వ‌న్ ఇప్పుడు ఎన్నిక‌ల రోజునే డిజాస్ట‌ర్ షో వేసిన‌ట్టు పోలింగ్ జ‌రుగుతోన్న తీరును బ‌ట్టి తెలుస్తోంది. అస‌లు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేస్తోన్న అభ్య‌ర్థులు ఎవ్వ‌రో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ప‌వ‌న్ క‌నీసం అన్న గెలిచిన‌ట్టు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో అయినా గెలుస్తాడా ?  లేదా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకుని అన్న రికార్డు బ‌ద్దలు కొడ‌తాడా ? అన్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పరిణామాలు.. ఎన్నికల్లో పవన్‌ గెలుపును ప్రభావితం చేస్తాయనిఅంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: