చెప్పేవాడికి వినేవాడు లోకువ అనేది నాటి సూక్తి అయితే..చూపించే వాడికి చూసేవాడు లోకువ కంటే తక్కువనేది ఈ ఎలక్ట్రానిక్ యుగంలో నడుస్తున్న నానుడి. 


భారత దేశంలో మొత్తానికి  తెలుగు, తమిళ భాషలకొక ప్రత్యేకత ఉంది. సృజనాత్మకతలోనూ, సెంటిమెంటల్ గా, కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థల్లోనూ తమదైన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న ద్రవిడ, దక్కను, శాతవాహన చరిత్రలివి.


తెలుగు మీడియా, తమిళ మీడియా కూడా ఒక పేరు ఇదుగో దున్నపోతు ఈనిందంటే..పెయ్యను కట్టేసి పాలు పితకమంటాయని పేరు.. దానికి తగ్గట్టే ఉంటుంది ఈ మీడియా ఛానెళ్ళ అతి.


మొన్నటికి మొన్న ఒక ఫేక్ సర్వేను పట్టుకొచ్చి ఢాం-ఢూం-ఢిష్యూం అంటూ అదరగొట్టేశారు..కట్ చేస్తే మధ్యాహ్నానికి ఆ సర్వే ఫేక్ అని సదరు సంస్థ అడ్డంగా తేల్చేసింది... ఇలాంటి ఉదంతాలెన్నెన్నో అంటున్నారు ఆంధ్రప్రజ.


తెలుగులో ఉన్న దాదాపు డజను చిన్న-పెద్ద వార్త ఛానెళ్లను వరుసగా పెట్టి చూస్తే ఉన్న మతి పోవడం ఖాయమని వాపోతున్నా రు ఆంధ్రప్రజ,  ఒక ఛానెల్లో సూపర్..బంపరంటే, మరో ఛానెల్లో అస్సలు ఏమీ బాగాలేదు..మంచే లేదంటారు.. ఒక ఛానెల్లో ప్రశాంతంగా అంటే మరో ఛానెల్లో బీభత్స-భయానకమంటూ ఏది నమ్మాలో-ఏది కాదో అని తేల్చకునే వీలు కూడా లేకుండా లేనట్లుంది మీడియా అంటూ తలలు పట్టుకుంటున్నారు ఆంధ్రప్రజ.


ఇదేనేమో చదవముందు కాకరకాయ అని - చదివిన తరువాత కీకరకాయ అనడమంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: