చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇంకా తెలివిలేని ఆరోపణలు చేస్తున్నారు.  ఏకంగా ముప్పై శాతం ఈవీఎంలు సరిగా పని చేయడం లేదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేది సమాధానం ఇచ్చారు. అది పూర్తిగా అబద్ధమైన ఆరోపణ అని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించారాయన.


మొత్తం వాడుతున్న ఈవీఎంలలో ముప్పై శాతం  పని చేయడం లేదనేది పూర్తిగా అబద్ధమని, కేవలం కొన్ని ఈవీఎంలు మాత్రమే సరిగా పని చేయలేదని, వాటిని కూడా తాము సరి చేయించామని, మరీ మొరాయించి, పోలింగ్ ఆగిన దాఖలాలు ఉన్నవి పాతిక మాత్రమే అని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ముప్పై శాతం ఈవీఎంలు పని చేయడం లేదన్న వారు ఎవరైనా తనకు వాటి జాబితాను ఇవ్వాలని ద్వివేదీ అన్నారు.


ఇక సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ పరమ సిల్లీ ఆరోపణను ద్వివేదీ తప్పు పట్టారు. ప్రతి పోలింగ్ సెంటర్ లోనూ మాక్ పోలింగ్ జరిగిందని, ఆయా పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలోనే మాక్ పోలింగ్ జరిగిందని..మాక్ పోలింగ్ కౌంటింగ్ కూడా చూపించాకా పోలింగ్ ను మొదలుపెట్టడం జరిగిందని ద్వివేదీ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: