నిజం గడపదాటేలోగా అబద్దం అయిదూళ్లు తిరిగొస్తుందనేది గ్రామాల్లో మన పెద్దలు అనుభవ పూర్వకంగా చెప్పే మాట.  దానికి తగ్గట్టుగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్విగేది గారు ఇప్పుడే ఎన్నికల బులిటిన్ విడుదల చేశారు.  దాదాపు 90 వేల ఈవీఎం మిషన్లలో, 344 ప్రాంతాల్లో మాత్రం కంప్లైంట్లు వచ్చాయని, వాటిలో 319 కంప్లైంట్లను యుద్ద ప్రాతిపదికన సరిచేశామని మిగిలిన 20+ కంప్లైంట్లు కూడా పూర్తి చేస్తున్నామని అన్నారు.


అంతే కాదు, పోలింగ్ మొదలయిన మొదటి కొన్ని గంటల్లోనే, అంటే 11 గంటల వరకు 15% శాతానికి పైగా పోలింగ్ జరిగిందని వెల్లడిం చేశారు. అంతే కాదు పోలింగ్ చురుకుగా, ప్రశంతంగా జరుగుతుందన్నారయన.


90 వేలకు పైగా ఈవీఎంల్లో 300 కంప్లైంట్ అంటే 99.4% ఈవీఎంలు బ్రహ్మాండంగా పని చేస్తున్నట్టేలే కదా? 0.1% ఈవీఎంల్లో మాత్రమే కంప్లైంటు వస్తే వాటిలో కూడా 300 పై కంప్లైంట్ సరి చేశామన్నారు. అంటే దాదాపు 99.999% పని బ్రంహాండంగా జరుగుతున్నట్లే కదా?


మరి ప్రొద్దున్న నుండి 30 శాతం ఈవీఎంలు అంటే దాదాపు 27 వేల ఈవీఎంలు పని చేయడం లేదన్నట్లు మీడియాలో వార్తలు, సాక్షత్తు ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు గారు ఎన్నికల కమిషన్ కు లేఖలు ఇవ్వడం దాదాపు అరడజను పైగా తెదేపా సాను భూతి మీడియాలో ఈవీఎంలపై రచ్చ - రచ్చ...ఎన్నికల అధికారి  చెప్పిన నంబర్లతో వీరి గోలంతా తుస్సపోయింది కదా?  అదే నిజం గడప దాటేలోపు..అబద్దం అయిదూళ్లు తిరిగిరావడంఅంటే.. అంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: