అవును మీరు చదివింది నిజమే. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ విజయానికి పాల్ కృషి చేస్తున్నారు. నిజానికి పాల్ చెబితే పడే  ఓట్లు ఉన్నాయా అని అనుమానం అవసరం లేదు. లేదని కచ్చితంగా చెప్పవచ్చు. పాల్ చెబితే ఎవరైనా ఓట్లేసేట్లుంటే అదేదో తన పార్టీకే ఓట్లు వేయమని చెప్పేవారే కాదు. కానీ అలాకాకుండా వైసిపి జెండాను చేతిలో పెట్టుకుని భీమవరంలో తిరుగుతున్నారంటే అర్ధమేంటి ?

 

నిజానికి చంద్రబాబునాయుడు తాను సమ ఉజ్జీలమంటూ పాల్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. ఎంతసేపు జనసేన అధిపతి  పవన్ కల్యాణ్ ను వచ్చి  తన పార్టీలో చేరమని చెప్పటం, తాను సిఎం కావాలని చంద్రబాబు కూడా కోరుకుంటున్నారనే పిచ్చి మాటలతోనే మీడియా ద్వారా జనాలకు వినోదాన్ని పంచారు. తాను పోటీ చేస్తున్న సర్సాపురం పార్లమెంటు పరిధిలో ఏమి ప్రచారం చేశారో ఎవరికీ తెలీదు.

 

మొత్తానికి అందరికీ  వినోదాన్ని పంచిన పాల్ చివరకు పోలింగ్ తేదీన విచిత్రంగా వైసిపి అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ ను గెలిపించాలంటూ వైసిపికి ప్రచారం చేశారు. అదేమిటంటే తనను చంద్రబాబు మోసం చేశాడంటూ మళ్ళి పిచ్చి ప్రేలాపనలు మొదలుపెట్టారు. ఒక చేతిలో ఈవిఎంల డమ్మీ పోస్టర్ చేతిలో పట్టుకుని మరో చేతిలో వైసిపి జెండాలు పట్టుకుని భీమవరంలో పాల్ తిరగటం చూసి జనాలు పాపం పాల్ అనుకుంటున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: