గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారు. నేరుగా 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు.

స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు కోడెలను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. కోడెల తీరువల్ల తాత్కాలికంగా అక్కడ పోలింగ్‌ నిలిచిపోయింది. సానుభూతి కోసమే ఆయన ఈ డ్రామాలు చేస్తున్నారని అక్కడి ఓటర్లు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో కోడెల కుమారుడు శివరామ్‌ హల్‌చల్‌ చేశారు.

ఎస్సై ఏడుకొండలును వెంటపెట్టుకొని పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారు. వాస్తవానికి ఆ గ్రామంతో శివరామ్‌కు ఎలాంటి సంబంధంలేదు. కానీ పోలీంగ్‌ బూత్‌లోకి ఆయన వెళ్లి అక్కడే కూర్చోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంతో మీకేం పని అని​ శివరామ్‌ను నిలదీశారు. ఎస్సైతో సహా శివరామ్‌ను గ్రామం చివరకు వరకూ తరిమికొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: