పోలింగ్ బూతుల దగ్గర రాజకీయ నేతలు హాలచల్ చేస్తున్నారు. ఇలాంటి  గొడవల మధ్య ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.  పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు , వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మేము ఏమి తక్కువ కాదంటూ జనసేన నాయకుడు కూడా ఇలాంటి పనే చేశారుఅనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మదుసూదన్‌ గుప్తా విధ్వంసానికి పాల్పడ్డారు. 

పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ను ధ్వంసం చేశారు. ఓటింగ్‌ ఛాంబర్‌లో శాసనసభ, లోక్‌సభ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్‌ సిబ్బందితో గొడవకు దిగారు.ఆగ్రహంతో ఊడిపోతూ ఈవీఎంను నేలకేసి కొట్టారు. 

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మళ్ళీ పోలింగ్ మొదలవుడానికి చాలా సమయం పట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: