రాష్ట్రంలో చాలా చోట్లా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 7 గంటలకే మొదలవ్వాల్సిన పోలింగ్ ఆలస్యంగా మొదలయింది. దాదాపు 1800 ఈవీఎంలు పనిచేయలదని చెవుతున్నారు. ఇంకా చాలా చోట్ల మధ్యాహ్నం అవుతున్న పోలింగ్ మొదలవ్వలేదు.


అధికారుల వైఫల్యమా  లేక సాంకేతిక లోపమా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.పలుచోట్ల అసలు పోలింగ్ మొదలవకముందే ఓట్లు వెసినట్లుగా ఓట్ల సంఖ్యను ఈవీఎం మెషెన్ చూపించడం ఓటర్లను ఆశ్చర్య పరిచింది. అసలు పోలింగ్ జరగకముందే ఓటు వేసినట్టు చూపించడం ఏంటి అంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే అది సాంకేతిక లోపం వల్ల తలెత్తిన సమస్య అని దీని పై ఎవరు హైరానా పడవద్దని అక్కడి సిబ్బంది తెలిపారు.


ఉన్నత  అధికారుల ద్వారా ఈవీఎంల ను సరిచేశారు.ఇప్పటి దాకా ఏ రాష్ట్రం లో ఇలా జరగలేదు. పోలింగ్ సాఫీగా సాగించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలం అయ్యింది అని చెప్పాలి. చాలా మంది లైన్ లో నిలబడలేక అలిసిపోయి చేసేది ఏమి లేక వెనక్కి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: