చూస్తుంటే అందరికీ  అదే అనిపిస్తోంది.  ఉదయం నుండి మొదలైన పోలింగ్ సమయం గడిచేకొద్దీ వేగం పుంజుకుంది. అయితే చాలా చోట్ల ఈవిఎంలు మొరాయించటంతో పోలింగ్ స్పీడ్ తగ్గినా మెల్లిగా పుంజుకుంది.  వివిధ జిల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఫ్యాన్ బాగా స్పీడుగా తిరుగుతోందనే అనుకోవాలి. చాలాసేపు ఈవిఎంలు మొరాయించటంతో ఓట్లు వేయకుండా కొందరు వెనక్కు వెళ్ళిపోయినా చాలామంది పట్టుదలగా పోలింగ్ కేంద్రాల్లోనే ఉండి ఓట్లు వేసి మరీ బయటకు వచ్చారు.

 

ఓట్లు వేసిన వాళ్ళల్లో చాలామంది వైసిపికే వేసినట్లు చెబుతున్నారట.  అసలు ఉదయం 7 గంటలకన్నా ముందే జనాలు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి నిలబడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది.   ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటేందుకు సిద్ధపడితేనే జనాలు ఈ స్ధాయిలో పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరుతారు. అధికార పార్టీపై వ్యతిరేకత లేకపోయినా ప్రతిపక్షంపై నమ్మకం లేకపోయినా జనాల్లో ఓటింగ్ విషయంలో నిర్లిప్తత కనబడుతుంది.

 

పోయిన ఎన్నికల్లో పోలింగ్  78 శాతం నమోదైంది. అలాంటిది ఈ ఎన్నికల్లో ఇప్పటికి 55 శాతంకు చేరుకుంది. మరో మూడు గంటల సమయం ఉంది కాబట్టి కనీసం పోయిన ఎన్నికల శాతానికి చేరుకుంటుందని అంచనాలో ఉన్నారు. అదే జరిగితే వైసిపి గెలుపు అవకాశాలు స్పష్టంగా మెరుగుపడతాయని చెప్పటంలో సందేహం అవసరం లేదు.

 

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు గ్రేటర్ రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసిపికి అనుకూలంగా బాగా ఓటింగ్ జరిగిందని ఓ అంచనా. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే టిడిపికి ఓ మోస్తరుగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది.  కాబట్టి టిడిపి వర్గాల  సమాచారం కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. టిడిపిని  రాజధాని జిల్లాలు రెండు మాత్రమే ఆదుకునేట్లు కనిపిస్తోంది. మొత్తానికి జిల్లాల సమాచారం ప్రకారం అయితే ఫ్యాన్ గాలి బాగా స్పీడుగా ఉందనే చెప్పుకోవాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: