నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం…దేశంలో అందరి చూపు పడిన పార్లమెంటు సెగ్మెంట్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 185 మంది బరిలో నిలిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి పన్నెండు బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. 1,788 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎల్ ఆకారంలో ఈవీఎంల అమరికను కూర్పు చేశారు. మొత్తం 12వేల సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పనిచేయనున్నారు. బెల్, ఈసీఐఎల్ నుంచి 400 మంది ఇంజినీర్లు ఈవీఎంలను పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల గుర్తుల విషయంలో అయోమయానికి గురికాకుండా ఓటర్ల అవగాహన కోసం పోలింగ్ కేంద్రాల బయట ప్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఎవరికి ఏ గుర్తు ఉన్నదో స్పష్టంగా కనిపించేటట్లు పెడుతున్నారు. ఈ ఎన్నికకు కావాల్సిన 26వేల బ్యాలెట్ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 21,500 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  


185 మంది బరిలో ఉన్న ఈ సెగ్మెంట్లోముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మహిళా ఓటర్లు ఎవరివైపుమొగ్గుచూపితే వాళ్లే గెలి చే అవకాశాలున్నాయి. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో పురుషుల ఓటర్లకంటే మహిళా ఓటర్ల సంఖ్య 76,112 మేరఎక్కువగా ఉంది. లోక్ సభ పరిధిలో జగిత్యా ల,కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజమాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లు న్నాయి. వీటన్నింటిలోనూ మహిళా ఓటర్లేఎక్కువ. మొత్తంగా 15,53,301 మంది ఓటర్లుం -టే 7,38,577 మంది పురుషులు, 8,14,689మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు.మహిళా ఓటర్లలో లక్షన్నర మంది వరకు బీడీకార్మి కులే.రైతుల పోరాటంతో జాతీయ స్థాయిలో దృష్టి పడిన నిజామాబాద్ లోక్సభ స్థానంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. 185 మంది బరిలో ఉన్న ఈ సెగ్మెంట్లోముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, 176 మందిరైతులు పోటీ చేస్తున్నారు.

గురువారం పోలింగ్ జరుగుతోం ది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎవరివైపుమొగ్గుచూపితే వాళ్లే గెలి చే అవకాశాలున్నాయి.76,112 మంది ఎక్కువనిజామాబాద్ లోక్ సభ పరిధిలో పురుషుల ఓటర్లకంటే మహిళా ఓటర్ల సంఖ్య 76,112 మేరఎక్కువగా ఉంది. లోక్ సభ పరిధిలో జగిత్యా ల,కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజమాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లు న్నాయి. వీటన్నింటిలోనూ మహిళా ఓటర్లేఎక్కువ. మొత్తంగా 15,53,301 మంది ఓటర్లుంటే 7,38,577 మంది పురుషులు, 8,14,689మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు.మహిళా ఓటర్లలో లక్షన్నర మంది వరకు బీడీకార్మి కులే. దీంతో మహిళా మణుల ఓటును దక్కించుకునే వారే విజేతలుగా నిలువనున్నారు. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కష్టకాలం ఎదురవుతోందని తెలుస్తోంది. పోలింగ్ జరుగుతున్న కేంద్రాలలో మెజార్టీ పోలింగ్ బూత్లలో బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్లు కనిపించారు. కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్ల కొరత కనిపించింది. కాంగ్రెస్ ఏజెంట్లు లేకుండానే చాలా గ్రామాల్లో పోలింగ్ జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో తన భర్త అనిల్ కుమార్, అత్త, మామలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత క్యూలైన్లో నిల్చొని తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి తన సతీమణితో కలిసి నిజామాబాద్ నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ యాష్కీ నిజామాబాద్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: