పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో సాగాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఓటర్లను భయభ్రాంతులకు గురి చేద్దామని చాలా ప్రయత్నాలు జరిపిన ప్రజల నుండి మాత్రం అనూహ్యమైన స్పందన రావడంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో జిల్లాలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో భయాందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ పోలింగ్ శాతం ఊహించని విధంగా పెరగటం ఇప్పుడు అందరూ సంతోషదాయకంగా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ శాతం చూస్తుంటే ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా లేని విధంగా ఓటర్లలో చైతన్యం వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇదిలా ఉండగా ఏలూరు పట్టణం లో అధికార పార్టీకి చెందిన నాయకులు వైసీపీ పార్టీ నాయకులపై బూత్ స్థాయి కమిటీపై కొన్ని చోట్ల దాడులు చేసినా కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమాత్రం బెదరకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అందరికి షాక్ కి గురి చేసింది. మొత్తంమీద విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రెండో సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగిందని అంటున్నారు అధికారులు.



మరింత సమాచారం తెలుసుకోండి: