ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థి గుంతకల్లు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో హడావిడి సృష్టించాడు. ఆ నియోజకవర్గంలో గుత్తి లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారులు సరైన ఏర్పాటు చేయలేదని జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలను నేలకేసి కొట్టినట్లు సమాచారం.


దీంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫోటోలు గుర్తులు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో అదే క్రమంలో మధుసూదన గుప్తా ఫోటో కూడా లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులపై మరియు సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సర్ది చెబుదామని ఎన్నికల అధికారులు ప్రయత్నించిన మధుసూదన్ గుప్త ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఆగ్రహంతో ఈవీఎంలను నేలకేసి కొట్టడంతో ఈవీఎంలు మొత్తం తునాతునకలైంది.


దీంతో బూతు లో ఉన్న పోలీసులు వెంటనే మధుసూదన్గుప్తా ను అరెస్టు చేయడంతో ఆ ప్రాంతమంతా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తో నెలకొంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత తన కాలు తగిలి ఈవీఎంలు కిందపడిపోయింది అంటూ మధుసూదన గుప్తా చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: