ఆంధ్రప్రజలు ఓటెయ్యడానికి పోటెత్తారు, ఓటరు జనప్రవాహ ఉదయం 6 గంటల నుండే పోలింగ్ బూతుల వద్ద క్యూలు కట్టినించున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద సౌకర్యాలు, ఈవీఎం మిషన్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు, ఏవో గొడవలు-గడవలే -గొడవలు అన్నట్లు సాగుతున్నా.. కొన్ని వార్తా ఛానెళ్లు కథనాలు, డిజీపీ కి ఇచ్చిన వినతి పత్రాలు, ఈసికి ఇచ్చిన వినతీ పత్రాలు..ఇవేవీ సునామీలాగా దూసుకుస్తున్న ఓటరు ప్రవాహానికి అడ్డు కట్ట వేయలేక పోయిందనేది ప్రజాస్వౌమ్య వాదుల విశ్లేషణ.


వృద్దులు, మహిళలు, యువకుల, మద్య వయస్కులు..వారూ-వీరు అనదేలేదు...అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా  పోలింగ్ లో పాలు పంచుకున్న విధానం చూస్తే... ఆంధ్రప్రజ విస్ఫష్టమయిన తీర్పునివ్వబోతున్నారు హంగ్ ఛాన్సేలేదని తేలిపోయింది.


రాబోయే ఫలితాలు కింగ్ నే ఇస్తాయి కానీ కింగ్ మేకర్ ని కాదనేది ఈ 2019 ఆంధ్ర ఎన్నికల పోలింగ్ సరళి మనకు తెలియజెప్పే అంశం. కర్ణాటకలో లాగా బిజెపి, కాంగ్రెస్ లు కొట్టుకుంటే పుట్టుక్కున సీఎం అయిపోయిన కుమారస్వామి వంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఉండదనేది ఇండియాహెరాల్డ్ గ్రూప్ యొక్క పరిశీలనాసారం..


దీని గురించి మీరేమంటారు.. కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..www.apherald.com ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు, పాదాభివందనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: