ఎన్నికలలో ఓటింగ్ సరళి..చూడడం అంటే సినిమా ప్రివ్యూ చూసినట్టే లేక్క. పోలింగ్ జరిగిన విధానం,  ఓటర్లు పాల్గొన్న విధానం, ఓటర్ల వయస్సు, ఆడా-మగా, పట్టణ, పల్లెటూర్ల ఓటర్లు శాతం ఇలాంటివన్నీ బయటికొస్తే... ఎవరు గెలవబోతున్నారనేది బ్రహ్మాండంగా తెలుసుకునే అవకాశం.  పోలింగ్ కు ముందు జరిగే సర్వేలలో నిజమయ్యే శాతం నూటికి 30% నుండి 45% అయితే పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వచ్చే సర్వేలు నిజమయ్యే శాతం 65% నుంచి 90% వరకు..


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సరళి గమనించి రాజకీయ విశ్లేషకులు, చెబుతున్నదేమిటంటే. ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మక మయిన ఓటింగ్ జరిగింది.  అన్ని వర్గాల వారు, ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి, వృద్దులు, మహిళలు, యువకులు కసిగా ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం 6 గంల నుండే ఓటర్లు బారులు తీరి ఓటింగ్ ఇప్పుడు దాదాపు సాయంత్ర 5 గంట దాటుతున్నా ఓటర్లు క్యూ లు పెరిగాయి.  ఇదొక విప్లవాత్మకమయిన ఓటింగ్ అని చెప్పొచ్చు.


ఓటర్లు ఇంత చైతన్యవంతంగా ఓటింగ్ లో పాల్గొనడమే చంద్రబాబు నేతృత్వ తేదేపా ప్రభుత్వం మీద ప్రజలలో ఉన్న వ్యతి రేకత అంటున్నారు వైసీపీ నాయకులు, చాలీ-చాలక చేసిన రుణమాఫి, బ్యాంకుల వడ్డీలు కట్టడానికి కూడా సరిపోక అప్పుల పాలయ్యామని రైతులు, ఉద్యోగాలిస్తామని మోసం చేశారంటూ యువత, వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా 5 ఏళ్లలో ఎన్నికల ముందు మాత్రమే పసుపు-కుంకుమంటూ చెల్లని చెక్కులిచ్చారని మహిళలు బాధలో ఉన్నారు. 



విపరీతమయిన కరువు నుండి బయటపడాలంటే బాబు..గద్దె దిగాలనే సెంటిమెంట్ పల్లె ప్రజలు ఈ విప్లవాత్మక ఓటింగ్ లో పాల్గొని వైసీపీ జగన్ ప్రభుత్వం రావాలని విస్పష్టమయిన తీర్పు ఇచ్చారన్నది వైసీపీ నాయకులవాదన. చాలా లాజికల్ గానే అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఫలితం మే 23 న తేలాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: