మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి ఎన్నికలు పూర్తి అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కనీనం ముగ్గురు చనిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. అనేకమందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే పోలింగ్ సరళి ఏకపక్షమా. కాదా వచ్చిన జనం ఎటువైపు ఇపుడు ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.

 


ఈసారి పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఎక్కువగా మహిళలు, యువత, వ్రుద్ధులు వచ్చారు. వ్రుద్ధులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు.  డెబ్బయి, ఎనభయి ఏళ్ళు దాటిన వారంతా వచ్చి ఓటు చేశారు. ఇది నిజంగా ఈసారి కనిపించిన ఓ విశేషంగా చూడాలి. గతంలో వ్రుద్ధులు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ముఖ్యంగా పించన్లు ఇస్తున్న బాబు రుణం తీర్చుకోవడానికి వచ్చిన వారిగానే ఇది కనబడుతోందని అంటున్నారు. పెద్ద కొడుకుగా బాబు నిలిచి రెండు వేల రూపాయల పించను ఇస్తున్నారని వ్రుద్ధులు భావిస్తున్నట్లుగా పోలింగ్ విధానం బట్టి అర్ధమవుతోంది.

 

 ఇక మహిళలు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చారు. దాని బట్టి ఆలొ చిస్తే పెద్ద అన్నలా బాబు వారికి ఉంటానని చెప్పిన మాటలు, సరిగ్గా ఎన్నికల ముందు మూడు విడతలుగా  ఇచ్చిన పదివేల రూపాయల సాయం మహిళల విషయంలో ఒక సానుకూల స్పందనగా చూస్తున్నారు. విరగబడి మహిళలు రావడం వెనక ఇదే విషయం అయితే మాత్రం అది అధికార తెలుగుదేశం పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. మొత్తం మీద వై సీపీ గాలిని కూడా తక్కువ అంచనా వేయలేం కానీ దానికి బ్రేకులు వేసేలా ఈ రెండు అంశాలు ఉంటే మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా  ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: