అధికారాన్ని అడ్డుపెట్టుకుని బరితెగించిన కొందరు నేతలపై జనాలు ఏ స్ధాయిలో మండిపోతున్నారో చెప్పటానికి సత్తెనపల్లి నియోజకవర్గమే ఉదాహరణ. పోలింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన కోడెలను జనాలు తరిమికొట్టారు. సత్తెనపల్లి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది టిడిసి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబమే. స్పీకర్ గా కోడెల ఐదేళ్ళ కాలంలో  ఒకవైపు కూతురు మరోవైపు కొడుకు చేయని అరాచకం లేదని వైసిపి నేతలు ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.

 

సత్తెనపల్లిలో కొడుకు, నరసరావుపేటలో కూతురు చేసిన ధౌర్జన్యాలకు, అరాచకాలకు జనాలతో పాటు పార్టీ నేతలు కూడా మండిపోయారట. సరే వాళ్ళ అరాచకాల గురించి ఇపుడు కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. ఈ ఎన్నికల్లో కోడెల కుటుంబానికి ఎక్కడ టికెట్ ఇచ్చినా తామే ఓడగొడతామంటూ స్వయంగా రెండు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు బహిరంగంగా రోడ్లపై బ్యానర్లు పట్టుకున్న విషయం అప్పట్లో సంచలనంగా మారింది. తమ మాటను కాదని చంద్రబాబు గనుక కోడెలకు టికెట్ ఇస్తే ఓడగొడతామని కూడా హెచ్చరించారు.

 

సరే అదంతా గతమనుకోండి అది వేరే సంగతి. మొత్తానికి ఎంతమంది వ్యతిరేకించినా చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిలో కోడెలకే టికెట్ ఇచ్చారు. ప్రచారం ఎలా చేసుకున్నా పోలింగ్ రోజున మాత్రం జనాలను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని కోడెల మద్దతుదారులు ప్రయత్నించారు. అందులో భాగంగానే కోడెల ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటం తలుపులేసుకోవటం అక్కడ గొడవ జరగటం అందరికీ తెలిసిందే.

 

కొద్దిసేపు గొడవ తర్వాత హఠాత్తుగా తలుపులు తెరుచుకోవటం లోపల నుండి కోడెల వచ్చి స్పృహతప్పి బయట పడిపోవటం ఇంకా సంచలనమైంది.  సరే అందుకు కారణం మీరంటే కాదు మీరే అంటూ వాదోపవాదాలు కూడా జరిగాయిలేండి. అదంతా పక్కన పెడితే పోలింగ్ బూత్ లో నుండి బయటకు వచ్చిన కోడెలను స్ధానికులు గట్టిగా తగులుకున్నారు.

 

ఐదేళ్ళ పాటు తమను అన్నీ రకాలుగాను సతాయించి ఇపుడు తమ గ్రామంలోకి ఎందుకు వచ్చారంటూ గట్టిగా నిలదీశారు. కోడెలతోనే పెద్ద గొడవేసుకున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన కోడెలను వెళ్ళిపోవాలంటూ జనాలు నినాదాలు మొదలుపెట్టారు. ఒక దశలో కోడెల కారుపైకి దాడి కూడా చేశారు. మొత్తానికి భద్రతా సిబ్బంది కోడెలను కారులో కూర్చోపెట్టగానే జనాలు ఒక్కసారిగా కారుపైకి కర్రలతో  దాడి చేశారు. కోడెల కారు పోలింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోయేంత వరకూ కర్రలతో బాదుతునే ఉన్నారు. అంటే కోడెలపై జనాలకు ఏ స్ధాయిలో ఆగ్రహం ఉందో అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: