తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతం పూర్తయింది. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఓటును పలువురు వినియోగించుకోలేక పోయారు. ప్రముఖ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని తల్లి, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ శోభన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఓటు వేయడం కోసమని విదేశాల నుంచి భారత్ వచ్చిన శోభన.. ఓటర్ లిస్టులో ఆమె పేరు లేకపోవడంతో ఓటేయకుండానే వెనుదిగిరి వచ్చేసింది. ఈ విషయంపై బయటికి వచ్చి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. అయితే, ఆమె ఓటు విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


శోభన ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా ఆమె ఓటు హక్కు లేదని స్పష్టం చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనతో స్పందించారు. ``భారత పౌరురాలిగా ఇది నాకు ఒక చెత్తరోజు. నేను విదేశాల్లో పర్యటనలో ఉండి కూడా ఓటు వేయడం కోసం ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడి ఎన్నికల సిబ్బంది నా ఓటు డిలీట్ అయిందని చెప్తున్నారు. నేను భారత పౌరురాలిని కాదా..? లేదంటే తన ఓటు అంత ముఖ్యమైంది కాదని అనుకుంటున్నారా?`` అని ప్రశ్నించారు. తన ఓటును తొలగించి నేరం చేశారని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదని శోభన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిరభ్యంతరంగా ఓటేశానని, కానీ ఇప్పుడిలా తన ఓటు తొలగించడమేంటని మండిపడ్డారు.


కాగా, శోభన కూతురు ఉపాసన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా అమ్మ శోభన కామినేని ఇవాళ ఓటు వేయలేకపోయారు. పది రోజుల క్రితమే ఆమె ఓటర్ లిస్ట్ లో తన పేరును చెక్ చేసుకుంటే వుంది. కానీ ఇవాళ చూస్తే డిలేట్ అయినట్లు చూపిస్తోంది. ఆమె ట్యాక్స్ పేయర్. అలాంటి వ్యక్తే ఇప్పుడు లెక్కలో లేకుండా పోయింది. ఆమెను భారత పౌరురాలిగా భావించడం లేదా?” అంటూ ఉపాసన సీరియస్ గా ట్వీట్ చేశారు.


కాగా, శోభన ఓటు తొలగింపుపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ``నాంపల్లి శాసనసభ నియోజకవర్గం(63)లోని పోలింగ్ కేంద్రం49లోని ఓటర్ల జాబితాలో శోభనకు 734, 735 సీరియల్ నంబర్లతో రెండు ఓట్లున్నాయి. ఈ రెండు ఎంట్రీలతో సెప్టెంబరు, 2017 నుంచి ఆమె వద్ద రెండు ఎపిక్ కార్డులు (WRH1050657), (KYJ2288397) ఉన్నాయి. ఇటీవల డూప్లికేట్ కార్డులను తొలగంచే ప్రక్రియ మొదలయిన తరువాత దీనిని గుర్తించి బి.ఎల్.ఓ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎక్కడో జరిగిన లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో రెండు ఎంట్రీలను తొలగించేసారు. ఈ విషయంలో ERO ను సంజాయిషీ అడగడం జరిగింది. ప్రస్తుతం దీనిమీద దర్యాప్తు జరుగుతున్నది`` అని వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: