నలబై ఏళ్ల అనుభవం..డెభ్బై ఏళ్లు నిండిన వయసు, రాజకీయ ఉద్దండ పిండం, అపరచాణక్యుడు, మూర్తీభవించిన సిసలై రాజకీయ నాయకుడు, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ గా కీర్తింపబడుతున్న చంద్రబాబు ఒక వైపు... దాదాపు నలబై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీతో సహ ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో అనుకూలతలు.


తండ్రి చనిపోయి చంద్రబాబు కొడుకంత వయస్సు, తండ్రి మఠాత్మరణంతో చెల్లా చెదురైనా అనుచరగణం, కకావిలమైన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు, రాజకీయ రంగంలో బుడి బుడి అడుగులు వేస్తున్న దశలో.. అన్న ప్రాసన రోజే ఆవకాయన్నట్లు తయారైన పరిస్థితులు అత్యంత గట్టివాడిగా పేరున్న చంద్రబాబు గారికి కోకొల్లల్లుగా హార్డ్ కోర్ అభిమానులు, పటిష్టమైన నెట్ వర్క్ ఉన్న టీడీపీతో పోరాటం.  ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రతికూలతలు..


ఘటనా -ఘటన సమర్థుడయిన చంద్రబాబు గారికి కొడుకంత వయస్సుండే జగన్ కి మద్యన జరిగిన ఎన్నికల పోరాటంలో అత్యంత కీలకమైన రోజు.  ఎవరెంత గొప్ప నాయకుడు పక్కగా సోదాహరణంగా రోజు.


చంద్రబాబు ప్రభుత్వాధినేత ఓటర్లకు భరోసా కల్పించి, ప్రజా తీర్పు దారాలంగా పొంది మళ్లీ అధికారంలోకి రావాల్సిన బాద్యత ఈయనది,  ప్రభుత్వ యంత్రాంగం-మంత్రాగం, ఐదేళ్ళ రాజ్యం చేసిన అనుభవం ఆ పరపతి ఈయనకు పెట్టని కోటలు.. ఎలాగూ పైన చెప్పిన అనుకూలతలు బ్రహ్మాండంగా ఉన్నాయి.  గట్టిగా మాట్లాడితే ఎటువంటి ప్రత్యర్థి పార్టీలైనా ఇలాంటి ప్రభుత్వం మీద గొంతు చించుకొని మాట్లాడాలి.


ఎన్నికల వేల పోలింగ్ గట్టి స్థానం వీరిది.  కానీ విచిత్రంగా చంద్రబాబు ఆగ్రహాలు, ఖండనలు, లేఖలు, మీడియా మీట్లు, రోజంతా టీవిల్లో కనిపించిన విధానాలు.. ఎలాగైనా, ఏదైనా అన్నట్లు ప్రవర్తించిన విధానం అస్సలు ఇది ఏమి నాయకత్వం అనిపించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


అసలు ఎన్నికల పోలింగ్ వేళ నాయకుడు అనేవాడు ఏలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఎన్నికల నియామవళి కాదు, నైతిక ప్రవర్తన కూడా... ఎన్నికల నియమావళి ఉన్నా నైతికంగా బాబు గారి అనుభవం..ఇరవై ఏళ్ల వెనక్కి పోయిందనకుంటున్నారు ఆంధ్రప్రజ.


ఇంకొక వైపు వైసీపీ జగన్ కొత్త పార్టీ, యువరక్తం, అస్సలు వీరిది రౌడీ రాజ్యం అంటూ బాబుగారు బ్రాండింగ్ చేసి వదిలిపెట్టారు.  జగన్ చేయి కదిపినా.. కన్ను కదిపినా..ఇదే రౌడీ రాజ్యం అంటూ విరుచుకు వందీ-మాగధ పడే మీడియా ఛానళ్లు.


ఇలాంటి పరిస్థితుల్లో కూడా నియమావళినే కాదు..నైతికంగా ఒక నాయకుడుగా ఆరు కోట్ల ఆంధ్ర ప్రజల గుండెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిలోనూ ఇదా జగనూ..వారెవ్వా శహభాష్ అన్పించుకున్నారు.


ఎలక్షన్ ప్రచారం ముగిసిన తర్వాత  మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇద్దరు కార్యకర్తలను చంపేస్తే.. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్ధులపై పాశవిక దాడి జరిగితే పన్నెత్తి మాట్లాడలేదు. 



ప్రశాంతంగా ఎన్నిక జరగాలి..ప్రజల ఆకాంక్ష గెలవాలి...ప్రజా ప్రభుత్వం రావాలి అని ఓపిక పట్టిన స్థిత ప్రజ్ఞత చూపించారు సాక్షాత్తు వైఎస్సార్ ఉన్నా ఇంత గొప్పగా చేసేవారు కారేమో అనిపించుకున్నారు. జగన్ గెలిచారు.. అంటున్నారందరూ.. ముక్తకంఠంతో మరీ మీరేమంటారు?


మరింత సమాచారం తెలుసుకోండి: