ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిని ఎవరైనా లక్ష్యం చేసుకున్నారా? నిన్న గురువారం ఉత్తరప్రదేశ్‌ లోని ఆయన సొంత నియోజక వర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతి నిధులతో ఆయన మాట్లాడుతున్న సమయంలో ఏడుసార్లు లేజర్‌ గన్‌ కిరణాలు రాహుల్‌ వైపు వచ్చాయని, దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడు, ఎఐసిసి అధ్యక్షునికి ప్రాణహాని ఉన్నట్లు అనుమానం కలుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాసారు.

Image result for rahul gandhi life threat

ఆకుపచ్చ కిరణాలు ఏడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పై పడ్డాయని ఆందోళన కలిగించే అంశ మని పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపించి ప్రమాదాన్ని నివారించాలని అలాంటివి ఏమైనా జరిగితే ప్రోటోకాల్‌ పరంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన సెక్యూరిటీని మరింత కఠిన తరం చేయాలని కోరారు. ఆకుపచ్చ రంగు లోని లేజర్‌ కిరణం కాంగ్రెస్‌ అద్యక్షునిపై ఏడుసార్లు ప్రసరింప చేసారని అందులోను నొసటిపై ఎక్కువసార్లు పడిందని ఎంతో అనుమానించదగిన అంశంగా కాంగ్రెస్‌ ప్రకటించింది.

Image result for rahul gandhi life threat

ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా ఏడు సార్లు ఈ కిరణాలను ప్రసరింప చేసారని, లేజర్‌ గన్‌ అయి ఉంటుందని, స్నిపర్‌ గన్‌ కూడా అయి ఉండవచ్చని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసారు. అంతే కాకుండా పార్టీ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా విడుదలచేసింది. హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ కు ఆ క్లిప్‌ను సైతం పంపించింది. ఈ లేఖ పై అహ్మద్‌ పటేల్‌, జై రామ్‌ రమేష్‌, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా లు సంతకాలు చేసారు. ఇందుకు సంబంధించి మాజీ రక్షణ సిబ్బందిని సైతం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక సాక్ష్యా ధారాలు రప్పించేందుకు ఈ లేజర్‌ కిరణాలు ఒక అత్యాధునిక ఆయుధం నుంచి వచ్చినవి అయి ఉంటాయని, బహుశా స్నిపర్‌ గన్‌ వంటిది అయి ఉంటుందని వెల్లడించారు.

Image result for rahul gandhi life threat

దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షునికి ఇచ్చిన రక్షణ పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నదని, సెక్యూరిటీని సైతం ఉల్లంఘించి స్నిప్పర్ గన్‌ వచ్చిందంటే ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొన్నారు. హంతకులు రాహుల్‌ గాంధీపై గురిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అయ్యాయన్నారు. అంతే కాకుండా రాహుల్‌ తండ్రి, నాయనమ్మను సైతం జాతి వ్యతిరేకులు హత్యచేసారని, అదే తరహాలో ఇపుడు రాహుల్‌కు సైతం ప్రమాదం పొంచి ఉందని నాయకు లు పేర్కొన్నారు. ముందు రాహుల్‌కు ఇచ్చిన సెక్యూరిటీని సమీక్షించాలని కోరారు. ఇలాంటి అనూహ్య సెక్యూరిటీ ప్రమాదాన్ని ముందుగానే గమనించి అరికట్టాలని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: