పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేశారు. ఆయన అక్కడ గెలుస్తారా. దీని మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ పోటీ చేయడంతో ఇది హాట్ సీట్ గా మారింది.  కడపటి వార్తలు అందేసరికి ఇక్కడ 70 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఎక్కువ ఓట్లు అంటే మూడు లక్షల పైగా ఉన్న అసెంబ్లీ సీటు ఇది.

 


పవన్ ఇక్కడ సరిగ్గా ప్రచారం చేయలేదన్న బాధ అభిమానుల్లో బాగా ఉంది. గాజువాకలో ఒక సభ రద్దుతో పాటు, వడ దెబ్బ కారణంగా గాజువాకలో పవన్ పెద్దగా ప్రచారం చేయలేదు. ఒకసారి నామినేషన్ సందర్భంగా వచ్చిన పవన్ ఆ తరువాత మరో మారు గంగవరం రోడ్ షో చేశారు. దాంతో అభిమానులే బాధ పడుతూంటే ఇక జనాల పరిస్థితి వేరేగా ఉండదా.

 


ఇక గాజువాకలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా గట్టిగా ఉన్నాయి. ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి సానుభూతిని నమ్ముకున్నారు. తనను ఈసారి ఎలాగైనా గెలిపించాలను ఆయన జనాలను వేడుకున్నారు. ఇంకోవైపు అభివ్రుధ్ధి మంత్రంతో టీడీపీ అభ్యర్ధి ప్రచారం చేసుకున్నారు. ఆయన బలమైన యాదవ సామజిక వర్గానికి చెందిన నాయకుడు. దాంతో ఈ ఇద్దరు పోటా పోటీగా చేసిన ప్రచారంలో పవన్ వెనకబడ్డట్లుగా తొలి నివేదికలు తెలియచేస్తున్నాయి. అయితే యువత మాత్రం గట్టిగా నిలబడి పవన్ కు ఓట్లు వేయడమే కాకుండా వేయించిందని అంటున్నారు. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: