విశాఖ ఎంపీ సీటు ఇపుడు బాగా ఇంటెరెస్టింగ్ గా మారింది. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న వారిలో జీడీ లక్ష్మీనారాయణ గెలుపు విషయంలో పెద్ద చర్చ సాగుతోంది. ఆయన గెలుస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా ఉంది. జేడీ అనూహ్యంగా విశాఖ బరిలో నిలవడం, అదీ జనసేన నుంచి పోటీ చేయడంతో ఈ కాంబినేషన్ ఎంతవర కు వర్కౌట్ అయిందన్న దాని మీద హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

 


పోలింగ్ సరళిని బట్టి చూస్తే జేడీ బాగానే ఓట్లను కొల్లగొట్టారని అంటున్నారు. అర్బన్ ఓటర్లు ఆయన ఇమేజ్ ని చూసి ఓట్లు వేస్తే, యువత పవన్ మ్యానియాతో అయన వైపు మొగ్గారని అంటున్నారు. ఇక ఉత్తరాది జనాభా ఓట్లను కూడా ఆయన బాగానే లాగేశారని తెలుస్తోంది  విద్యావంతులు, మెధావులు ఎక్కువగా ఉండే విశాఖలో జేడీ పోటీ చేయడం అనే వ్యూహం బాగా సక్సెస్  అయిందని అంటున్నారు అదే విధంగా బలమైన కాపు సామజిక వర్గం కూడా జేడీ కోసం చమటోడ్చిందని చెబుతున్నారు.

 


జేడీ రేసులో బలంగా ఉన్నారని తేలడంతో ఏ పార్టీ ఓట్లకు గండి పడిందన్న చర్చ కూడా వెంటనే వస్తోంది. నిజానికి అర్బన్ ఓటింగ్ మీద వైసీపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఆ పార్టీకి వారు వేయరు కూడా. జేడీ రేసులో లేకపోతే ఆ ఓట్లు టీడీపీకి పడేవి. ఇపుడు జేడీ బలంగా రావడం వల్ల టీడీపీ విజయావకాశాలు దారుణంగా దెబ్బ తిన్నాయని అంటున్నారు. మరి జేడీ ఈ ఓట్ల తో గెలుస్తారా లేక క్రాస్ బాగా జరగడం వల్ల  వైసెపీ గెలుస్తుందా అన్నది ఇపుడు తేలాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: