ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముఖ్య అధికారినే దిరించినట్టు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోల ప్రకారం చంద్రబాబు ఇలా బెదిరించారు.. 


ఎవరు వెరిఫైయింగ్‌ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు(ఎలక్షన్‌ కమిషన్‌) చూడాలి. ఇక మీ ఆఫీస్‌ ఎందుకు? క్లోజ్‌ చేసేయండి. ఎలక్షన్‌ కమిషన్‌ ఎవరు? నేను అడుగుతున్నా. సరిగా కండక్ట్‌ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్‌. 


మేం ఇంట్లో పడుకుంటాం. ఢిల్లీ చెప్పినట్టు యాజ్‌టీజ్‌గా మీరు ఎందుకు ఫాలో కావాలి? మీది పోస్ట్‌ ఆఫీస్‌ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే అన్నీ రద్దు చేసేయమనండి. అందరినీ తీసేయమనండి. ఒక్క క్లర్క్‌ను పెట్టుకుని చేసేయమనండి. మేం చూస్తాం. ఎన్నికల కమిషన్‌ ఏంటో చూస్తాం. అంత ఈజీగా వదిలిపెట్టను..


ఇవీ బాబు బెదిరింపులు.. మరి ఒక రాజ్యాంగబద్ద సంస్థ అధికారిని ఒక సీఎం ఇలా బెదిరించవచ్చా.. అలా బెదిరించే ముందు అసలు మనం చేసిన విధానం బాగా ఉందా.. ఈసీని కేంద్రం నియంత్రిస్తోందని చంద్రబాబు ఆరోపణ. మరి రాష్ట్రంలోని పోలీసులను ఇతర సంస్థలను చంద్రబాబు నియంత్రించలేదా..? అన్న ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానాలు ఉండవు. 


సీఈవోను చంద్రబాబు బెదిరించడంపై వైకాపా ఈసీకి ఫిర్యాదు చేసింది.రాజ్యాంగ విధిలో ఉన్న సీఈవో పట్ల చంద్రబాబు ఎలాంటి గౌరవం చూపలేదని, అంతేగాక ప్రచారం ముగిశాక సీఈవో వద్దకెళ్లి ఉద్దేశపూర్వకంగా ఆయన్ను బెదిరించారని తెలిపారు. ఈసీకి, సీఈవోకు భయం పుట్టించేలా ఈ బెదిరింపు ఉందని నివేదించారు. మరి దీనిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: