పోల్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు దిట్ట అన్న సంగతి సంగతి తెలిసిందే. కానీ ఈసారి చంద్రబాబు పోల్ మేనేజ్‌మెంట్‌ మరింత రోత పుట్టించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచే ప్రత్యర్థులపై మానసిక దాడి ప్రారంభించింది తెలుగుదేశం. ఈవీఎంలు సహజంగానే కొన్నిసార్లు మొరాయిస్తాయి. ఇది ప్రతిసారీ జరిగేదే.. 


దీన్ని తెలుగుదేశం అనుకూల మీడియాలో విపరీతమైన బ్రేకింగులు వేయడం.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు కనిపిస్తోంది. ఉదయం నుంచే తెలుగుదేశం అనుకూల మీడియోలో వైసీపీ అరాచకం చేస్తోందని బ్రేకింగుల మీద బ్రేకింగులు వేశారు. వాస్తవానికి తాడిపత్రిలో ఘర్షణలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇద్దరూ చనిపోయారు.

కానీ ఒక్క సాక్షి మీడియాలో తప్ప.. అన్నిచోట్లా టీడీపీ కార్యకర్త మృతి వార్త మాత్రమే బ్రేకింగ్ న్యూస్ అయ్యింది తప్ప.. వైసీపీపై దాడులు మీడియాలో కనిపించలేదు. దీనికితోడు  సాక్షాత్తూ సీఎం స్థాయి వ్యక్తి టీడీపీకి ఓటేస్తే వైసీపీకి పడుతోందంటూ ఆందోళన వెలిబుచ్చడం మరో రాజకీయం. 

ఆ తర్వాత ప్రతి గంటకూ అటు డీజీపీనో., ఈసీనో కలుస్తూ టీడీపీ బృందాలు వైసీపీ, టీఆర్ఎస్, మోడీ ఈసీని నియంత్రింస్తున్నారంటూ కంప్లయింట్ల మీద కంప్లయింట్లు.. ఇలా రోజంతా  టీడీపీ పోల్ మేనేజ్‌ మెంట్ చేసిన తీరు రోత పుట్టించిందని జనం భావిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: