సజావుగా ఎన్నికలు జరిపించటంలో ఎన్నికల సంఘం విఫలమైందనే ఆరోపణలు ఒక్కసారిగి పెరిగిపోయాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో ఈసికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఉన్నంతలో పోలింగ్ సిబ్బంది నిష్పాక్షికంగా ఉండేవారినే నియమించాలి. సరే అధికారుల కేటాయింపును పక్కనపెట్టినా గ్రౌండ్ లెవల్లో బాధ్యతలు నిర్వర్తించే పోలీసుల బలగాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి ఈసి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిందా ?

 

నిజానికి ఈసి తన బాధ్యతల్లో విఫలమైందనే చెప్పాలి. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు  మొరాయించాయి. టిడిపి  అభ్యర్ధులు, టిడిపి నేతలు యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఎవరిపైనా చర్యలు లేవు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్ధులు ఏకంగా బూత్ ల్లోకే వెళ్ళిపోయి తలుపులేసుకున్నారంటే పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధమైపోతోంది. కోడెల శివప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి  దాదాపు గంటపాటు తలుపులేసేసుకున్నారు. దాంతో పోలింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

అసలు కోడెల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి తలుపులేసుకోవటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అలాగే మంగళగిరి, కొండెపి, తంబళ్ళపల్లి, గుంతకల్, రాజంపేట లాంటి చాలా నియోజకవర్గాల్లో ఈవిఎంలు గంటలపాటు మొరాయించాయి. అందుకనే చాలా పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి కూడా పోలింగ్ జరపాల్సొచ్చింది. ఈ విషయాలను పక్కనపెడితే చాలా పోలింగ్ కేంద్రాల పరిధిలో హింసాత్మక ఘటనలు కూడా చాలానే జరిగాయి.

 

తంబళ్ళపల్లి, తాడిపత్రి, పీలేరు, గురజాల, తిరుపతి, పూతలపట్టు, చిత్తూరు, హిందుపురం, ఏలూరు, దెందులూరు, కురుపాం, నరసరావుపేట, సత్తెనపల్లి లాంటి అనేక నియోజకవర్గాల్లో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య చాలా గొడవలే జరిగాయి. నరసరావుపేట సిట్టింగ్ ఎంఎల్ఏ, వైసిపి అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, కురుపాం ఎంఎల్ఏ పాముల పుష్ప శ్రీవాణిపైనే టిడిపి మూకలు దాడులు చేశాయి. అలాగే పూతలపట్టు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధి బాబును చచ్చేట్లు కొట్టారు.

 

మొత్తానికి ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున శాంతి భద్రతలు కాపాడటంలో ఎన్నికల కమీషన్ విఫలమైందనే చెప్పాలి. పోలింగ్ అయినపోయిన తర్వాత రాత్రి కూడా కొన్ని నియోజకవర్గాల్లో దాడులు జరిగాయంటే లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమైపోతోంది. శుక్రవారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది. మొత్తం మీద విధి నిర్వహణలో ఇసి విఫలమైందనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: