ఎదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి...పదేళ్ళ క్రితం పేరు..ఆంధ్రదేశంలోని పదికోట్ల పేర్లలో ఒటకి. మరీనాడు ఆరుకోట్ల ఆంధ్రప్రజలు తమ కష్టాలు తీర్చే నాయకుడిని చూసుకుంటున్నారీ పేరులో... వైఎస్ఆర్ కొడుకుగా ప్రజలకు పరిచయమైనా..వైఎస్ఆర్,  జగన్ నాన్నే అనే స్థాయి 10 ఏళ్లలో ఎదగడానికి జగన్ చేసిన పరిశ్రమ కఠోరం.


ఈనాటి రాజకీయ నాయకులలో ఇంతటి కఠోర పరిశ్రమ చేసే నాయకుడేలేరంటే అతిశయోక్తి కాదేమో.  ఎన్నడూ చూడని అసెంబ్లీ లో మొట్ట మొదటి అడుగే పార్టీ అధినేతగా మొదలు పెట్టిన జగన్ ప్రయాణం, దేశంలోనే అపర చాణుక్యుడనే పేరున్న చంద్రబాబు కి రాజకీయ ప్రత్యర్థిగా జగన్ ఎదిగిన క్రమం అపూర్వం
చంద్రబాబెక్కడ-జగనెక్కడ.. ఉండేలు దేబ్బకి పిల్లకాకి అన్న వారే జగన్ రాజకీయ దెబ్బకి చంద్రబాబు తన నలబై ఏళ్ళ జీవితంలో మొట్ట మొదటి సారి ఉక్కిరి-బిక్కిరవుతున్నారంటే అర్థం చేసుకోవొచ్చు జగన్ చేసిన సాధన. 


దాదాపు 70 మంది శాసన సభ్యులతో ప్రతిపక్షనేతగా ఉంటే..కనీసం ఒక కార్పోరేటర్ కి ఇచ్చిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోయినా..అస్సలు వైఎస్సాఆర్  పార్టీ నే ఉండకూడదన్నట్లుగా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేసినా, ప్రతిరోజూ జగన్ అనేవాడు మనిషే కాదన్నట్లుటగా చేసిన వ్యక్తిత్వహననం, మానిసకంగా  కుంగదీసినా..నేలకేసి కొట్టే బంతి ఎంత గట్టిగా కొడితే- అంతకంటే ఎక్కువ బలంతో ఎగిరినట్లు..దెబ్బ కొట్టే దిక్కుకే ప్రాణాలకు తెగించి నడిచే స్కార్పియోలా... జగన్ మోహన్ రెడ్డి ఎదిగిన విధానం రాయడానికి, చదవడానికి బానే ఉంటుందేమయో కానీ.. ఆ కష్టం, ఒత్తిడి, సంఘర్షన ఏంటనేది పడేవారికే తెలుస్తుంది. 


అయిదేళ్ళ పాటు జగన్ మోహన్ రెడ్డి పేరును ఎత్తడానికి కూడా ఇష్టపడని తెదేపా ప్రభుత్వ నేతలు, వైసీపీని చిల్ల పార్టీలా చూసిన వారు... ఎన్నికల సమయం వచ్చేనాటికి జగన్, వైసీపీ అనే మాట మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చారు జగన్.


అశేష ప్రజల అభిమానం, ప్రేమ, గుండెల్లో జగనంటే ఒక నమ్మకం అని పెట్టుకున్న విధానం, సామాన్య ప్రజలతో ఆయన మమేకమయ్యే విధానం, ఇవన్నీ జగన్ ని వైఎస్సాఆర్ కంటే కూడా మంచి మాస్ లీడర్ లా తయారు చేశాయి.


ఇంత ఘన అభిమానాన్ని సంపాదించుకోవడానికి వైఎస్సాఆర్ కి జీవితకాలం పడితే.. తన రాజకీయ జీవితపు మొదటి దశలోనే అంతకంటే ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్నారు జగన్. వారసత్వం అనేది ఒక హాల్ టిక్కెట్ వంటిది మాత్రమే పరీక్ష ఫలితం మనం రాసే సమాధానాల మీదే ఆధారపడి ఉంటుందన్నట్లు...తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా తండ్రికి మించిన తనయుడిగా జగన్ రూపాంతరం చెందిన విధానం మిగిలిన నాయకులకు స్ఫూర్తి దాయకం.  


ఈనాడు జగన్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారత దేశం రాజకీయాల్లోనే కాదు, యావత్తు తెలుగు జాతిలోనే ఒక బ్రాండ్. ఆయన చెప్పినట్లుగానే దేవుని దయ, ప్రజల చల్లని దీవెనలు ఆయనకు ఉండి ముఖ్యమంత్రి అయితే వచ్చే కొన్ని తరాల వారి భవిష్యత్ లను తీర్చిదిద్దే విధంగా పాలిస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇకవేళ అటూ-ఇటయినా..జగన్ ని కరివేపాకులా తీసివేసినట్లు చేసినా ఇంతకు ముందు ప్రవర్తనలు చేయ్యడానికి కాదు కదా..చేయాలని ఆలోచించడానికి కూడా సాహసం చేయరు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు.


ఏతా -వాతా జగన్ దుకాణం బందవ్వుద్ది అని ఎగతాళి చేసే స్థాయి నుండి...జగన్ ఒక రాజకీయ శక్తి అనే విధంగా తనను, తాన పార్టీని రూపాంతరం చెందించిన జగన్, తండ్రికి తగ్గ తనయుడు గా, రాష్ట్ర ప్రజల నాయకుడిగా గెలిచేశాడు.


మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని ఈ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇండియాహెరాల్డ్ ను ఆదరిస్తున్న మీకందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ..కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 


మరింత సమాచారం తెలుసుకోండి: