తాజా ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమైనట్లే ఉంది. ఈరోజు మీడియాలో చంద్రబాబునాయుడు దాదాపు రెండు గంటలపాటు మాట్లాడారు. ఆయన మాటల సారాంశం ఏమిటంటే టిడిపి ఓడిపోతే అందుకు కారణం ఈసి, కెసియార్, మోడి, జగన్మోహన్ రెడ్డేనట. ఈవిఎంలు మొరాయించటం, జగన్ కు అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం, ఏపిలో తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులు లాంటివన్నీ కారణాలవుతాయని చెప్పకనే చంద్రబాబు చెప్పేశారు.

 

నిజానికి చంద్రబాబు మాటలు చాలా  విచిత్రంగా ఉన్నాయి. తమకు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎన్నికల కమీషన్  మొదటి విడతలోనే ఏపి ఎన్నికలను నిర్వహించేసిందట. అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడినే కారణమట. అలాగే ఇవిఎంలు రెండో కారణమట. ఈవిఎంలు మొరాయించటం, ట్యాంపర్ చేయటం లాంటవన్నీ రెండో కారణంగా చెప్పారు. చాలా చోట్ల ఈవిఎంలు పనిచేయకపోవటంతో ఓట్లు వేయాలని అనుకున్న వారు వెనక్కు వెళ్ళిపోయారట.

 

చిత్తశుద్దితో పనిచేసే చీఫ్ సెక్రటరి, ఇంటెలిజెన్స్ ఐబి లాంటి ఉన్నతాధికారులను ఈసి బదిలీ చేయటంపై మండిపడ్డారు.  అక్రమాస్తుల కేసుల్లో జగన్  సహనిందితుడు ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా నియమించటంలో కూడా కుట్ర ఉందట. కోవర్టుగా ఉంటాడనే ఎల్వీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిందని ఈసిపై మండిపడ్డారు.

 

ఈ విషయాలను తాను చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఫిర్యాదు చేయటం కోసం మంత్రులు, ఎంపిలతో తాను ఢిల్లీ వెళ్ళనున్నట్లు కూడా చెప్పారు. అంటే ఈసిని బెదిరించటమే అన్న విషయం అర్ధమవుతోంది. ఏదన్నా మంచి జరిగితే తన ఘనత గాను చెడు జరిగితే మాత్రం ఎదుటి వాళ్ళ చేతకాని తనంగా చెప్పటం చంద్రబాబుకు మొదటినుండి అలవాటే.

 

ఇక ఫైనల్ గా ఏపిలో తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులకు ఏం పని అంటూ ఓ పనికిమాలిన ప్రశ్న వేశారు. తెలంగాణా ఇంటెలిజెన్స్ ఎక్కడకన్నా వెళుతుంది. అందులో భాగంగానే ఏపికి వచ్చింది. అందులో తప్పేముంది ? మరి తెలంగాణా ఎన్నికలపుడు ఏపి ఇంటెలిజెన్స్ పోలీసులు తిరగలేదా ?  రామంగుండం, వేములవాడ, వరంగల్ లాంటి చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తు దొరికిన విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఈసి చేసిన తప్పులకు తామెందుకు శిక్షనుభవించాలని చంద్రబాబు చాలా అమాయకంగా అడుగుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు మాటలు చూస్తుంటే అందరికీ అర్ధమైందేమిటంటే టిడిపి ఓడిపోతోందని. 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: