నాయకులు వస్తారు, పోతారు, ప్రజాస్వౌమ్య ప్రభుత్వం ఉంటుంది మన గురువులు మనకు నేర్పిన పాఠం ఇది.  నీ పదవి ఐదేళ్ళే, నా ఉద్యోగం నేను రిటైరైయ్యేంత వరకూ.. ఓ ఐఏఎస్ అధికారి హీరో-రాజకీయ నాయకుడైన విలన్ తో సినిమాలో చెప్పే డైలాగ్.


అఖిల భారత సర్వీసు అధికారి కావడం అంటే తల్లి గర్భం దాల్చే శిశువుకి జననం ఇవ్వడం కంటే వందరెట్టు కష్ఠమని మన ప్రజల నానుడి.  130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఐఏఎస్ అధికారులు 0.1% కూడా ఉండరంటే వీరి ఎంపిక, తర్ఫీదు ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు.  ఐఎఎస్ అధికారి కావాలనేది, గ్రూప్స్ లో ఎంపిక కావాలనేది దాదాపు ప్రతి యువకుని లక్ష్యమంటే అతిశయోక్తి కాదేమో.


అల్లాంటి ఒక రాష్ట్ర పరిధిలోని పనిచేసే పదుల సంఖ్యలో ఉండే ఐఏఎస్ అధికారులకి బాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.  గమ్మత్తేంటంటే ప్రజాస్వౌమ్యంలో ప్రజలే నాయకులు కానీ..ఆ నాయకుల మాటలు ఆదేశాలుగా తయారు చేసేది మాత్రం ఐఏఎస్ అధికారులే.


ముఖ్యమంత్రి గారి పాలన, పథకాలు, ఎటువంటి విధాన నిర్ణయమైనా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగ-మంత్రాంగాలు వాటిపై పనిచేయగలుగుతాయి.


అటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఒక ముఖ్యమంత్రి, అందునా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమున్న, వందీ-మాగధులచే రాజనీతిజ్ఞుడని పిలవబడే చంద్రబాబు...ఒక కోవర్టుగా నిండు ప్రెస్ మీట్లో, మీడియా ముఖంగా...ఆన్ ది రికార్డు అన్నారంటే నమ్మలేక పోతున్నారు
ప్రజాస్వౌమ్యవాదులు, ఆంధ్రప్రజ, తెలుగు లోకం.


కష్ట-సుఖాలు, గెలుపోటములు, ఎలాంటి వారినైనా ఎలానైనా తయారు చేస్తాయంటే ఇదేనేమో అంటూ వాపోతున్నారు అందరూ!


మరింత సమాచారం తెలుసుకోండి: