అశ్వత్దామా హతః భారత కురుక్షేత్ర సంగ్రామం నాటిదీ మాట... గురువైన ద్రోణాచార్యుల వారు వేసే అస్త్రాలకు తాళలేక - వాటికి జవాబివ్వలేని సందిగ్ధావస్థలో ఉన్నపుడు ధర్మరాజుతో ద్రోణునికి వినిపించేటట్లు చెప్పిస్తాడు కృష్ణుడు అశ్వత్దామా హతః అంటే అయ్యా నీ కుమారడు అశ్వత్దామా చంపివేయబడ్డాడు  అని...ధర్మరాజు అంటే సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపం కదా..ఆయన నోటి వెంట వచ్చింది నిజమేనని నమ్మి క్షణకాలం ఖిన్నుడై నించుంటాడు ద్రోణుల వారు, ఆ కాస్త సమయంలో వారి తలను కొట్టేస్తాడు అర్జునుడు... ఇప్పుడు తను మొదలు పెట్టిన వ్యాఖ్యాన్ని పూర్తి చేస్తాడు ధర్మరాజు కుంజరహః అని అంటే... అశ్వత్దామా అనే ఏనుగు చంపివేయబడిందని..లోక కళ్యాణార్థం ఇది చేయవలసిన పని అంటాడు కృష్ణుడు.


కట్ చేస్తే..2019 ఎన్నికల పోలింగ్ రోజు అంటే నిన్న.. తెదేపా నాయకులు, తెదేపా సానుభూతి మీడియా పోలింగ్ మొదలు పెట్టిన కాసేపటికే బ్రేకింగులు 30% ఈవీఎంలు పని చేయట్లేదు అని... ఎన్నికల అధికారేమో 90 వేల ఈవీఎంలలో 344 ఈవీఎంలు మాత్రమే కంప్లైంట్ వచ్చాయి వాటిలో 319 మేము సరిచేశాము అని చెప్పారు...అయినా ఈ బ్రేకింగులు రాత్రి వరకు నడుస్తూనే ఉన్నాయి.  ఈవీఎంలు పని చేయట్లేదనేది పెద్ద చర్చ అయ్యింది.


ఈ అశ్వత్దామా హతః  కు ముగింపు ఈనాటి ప్రెస్ మీట్లో ఇచ్చారు బాబుగారు అదేంటంటే.. ‘సీఎం నివసించే ప్రాంతంలో  35% ఈవీఎంలు పనిచేయట్లేదట’ అంటే వారి నివాసం దగ్గరిలో ఉ్న ఒకట్రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఒక 20-30 ఈవీఎంల్లో 3-10 ఈవీఎంలు పనిచేయకపోయినట్లే కదా... మరి ఆరు కోట్లు ఆంధ్రుల, 12 కోట్ల తెలుగు వారికి అర్థం అయ్యే ఈ లాజిక్... సరే కానీ ఈ 3-10 ఈవీఎంలు పనిచేయపోతే .... మిగిలిన 90 వేల ఈవీఎంలు పనిచేయనట్లు ఫీల్ అయిపోయి, జనాలను ఫీల్ చేయించింది తెదేపా సానుకూల మీడియా.


ఇలాంటి వార్తలు చూసి ఓటేద్దామని రెడీ అయి కూడా ఆగిపోయిన వారికప్పుడు ఎవరు సమాధానం చెబుతారు? నీ తప్పది.. నీకు ప్రజాస్వౌమ్యం మీద గౌరవం లేదంటూ వాళ్ళమీద కూడా ఎదురు దాడి చేయరు కదా కొంపతీసి? ఏమో..


మరింత సమాచారం తెలుసుకోండి: