చంద్రబాబు సీనియర్ నాయకుడే కానీ ఆయన ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ చాలా చిత్రంగా ఉంటూ ఉంటాయి. ఈవీఎం లను పెట్టమన్నదీ ఆయనే. ఇపుడు వద్దంటున్నదీ ఆయనే. పెద్ద నోట్లు రద్దు చేయమన్నదీ, మద్దతు ఇచ్చిందీ ఆయనే, ఇపుడు దాన్ని తప్పు పడుతోందీ ఆయనే.


ఇదిలా ఉండగా మొత్తానికి చంద్రబాబు ఏపీలో జరిగిన పోలింగ్ మీద కాస్తా ఆలస్యంగా ఈ రోజు స్పందించారు.   మీడియా మీట్లో బాబు అనేక విషయాలు మాట్లాడారు. ఎన్నికలు ఇవేనా. ఇలాగేనా నిర్వహించేది అంటూ చంద్రబాబు ఓ వైపు ఈసీని ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తున్నారు. మమ్మల్ని ఓడించాలని చూశారని ఆయనే చెబుతున్నారు. అయినా మేమే గెలుస్తామని మరో వైపు చెబుతున్నారు. ఈ పరస్పర విధానం ఏంటో బాబే చెప్పాలి.


ఇక చంద్రబాబు ఈసీ మీద తన పోరాటం అంటున్నారు. దేశంలో ఇలా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు, ఎన్నికలు తీరు బాలేదని, అసలు ఇవి ఎన్నికలేనా, ఇలాగేనా జరిపించేది అంటూ బాబు కస్సుబుస్సులాడుతున్నారు. ఈవీఎం ల మీద కూడా ఆయన ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇన్ని చెబుతున్న చంద్రబాబు చివర్లో అన్న మాట ఏంటి అంటే ఏపీలో సైలెంట్ ఓటింగ్ ఉందని, దాంతో తమ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుందని చెబుతున్నారు. మరి బాబు గారి వితండ వాదం పై సెటైర్లు అలా ఇలా పడడంలేదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: