బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్ కి వెన్నుపోటు  దెబ్బ పడిందా. ఆయన పరిస్థితి ఏంటి. విశాఖ ఎంపీ కావాలని, తాత ఎంవీవీఎస్ మూర్తి పేరు నిలబెట్టాలని ఎన్నో కలలు కన్న ఈ యువకుడు గెలుస్తాడా.


విశాఖ ఎంపీ సీటును ఎవరు కైవశం చేసుకుంటారన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. నిజానికి విశాఖ ఎంపీని ఈసారి ఎలాగైనా కొట్టాలని మొదట్లో టీడీపీ విశ్వ ప్రయత్నం చేసింది. అయితే తరువాత మారిని రాజకీయ పరిణామాలు నేపధ్యంలో జనసేన నుంచి జేడీ లక్ష్మీ నారాయణ బరిలోకి దిగారు. ఆయన్ని గెలిపించేందుకు భరత్ ని ఫణంగా పెడుతున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇపుడు ఇదే నిజమని వైసీపీకి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చెబుతున్నారు.



విశాఖలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో దాడి మాట్లాడుతూ టీడీపీ జనసేన ముసుగులు పోలింగ్ రోజు పూర్తిగా తొలగించారని అన్నారు. ఈ రెండు పార్టీలు కలసిపోయి వైసీపీ మీద పడ్డాయని ఆరోపించారు. ఇక విశాఖలో ఏకంగా బాలయ్య చిన్నల్లుడికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. విశాఖపట్నంలో మాజీ పోలీసు అదికారి లక్ష్మీనారాయణను గెలిపించడానికి చంద్రబాబు నాయుడు అన్ని విదాల ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. . విశాఖలో లక్ష్మీనారాయణకు సహకరించడంలో లోకేష్ రాజకీయం కూడా ఉందని, తద్వారా తోడల్లుడు భరత్ రాజకీయంగా ఎదగరాదని బావించారని ఆయన అన్నారు.


గాజువాకలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఓట్లు వేయాలని టిడిపి ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ నేపద్యంలో నే అనకాపల్లి తదితర చోట్ల జనసేన అబ్యర్దులు రంగం నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్నారని ఆయన అన్నారు. ఇన్ని జరిగినా ప్రజలు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని ,మార్పును స్వాగతించారని దాడి అన్నారు.విశాఖ జిల్లాలో పదకుండు సీట్లను వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చేది మా ప్రభుత్వమే, చంద్రబాబు ఆటలు ఇంక సాగవని దాడి స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: