ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. ఏ పార్టీకి గెలవబోతుంది .. ఏ పార్టీ ఓడిపోబోతుంది అని ఇప్పటికే విశ్లేషణలు మొదలైయ్యాయి. అయితే సూళ్లూరుపేట ఆది నుంచి టీడీపీకి పెట్టని కోట.. 2014లో టీడీపీ నుంచి పరసారత్నం కొద్ది తేడాతోనే వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. స్థానిక నేతల వెన్నుపోటే కారణంగా చెబుతారు. మొన్నటి ఎన్నికల్లో తిరిగి పరసారత్నంకు టికెట్ ఇవ్వవద్దని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.


ఇక పరసారత్నం కూడా తన వద్ద డబ్బులు లేవని చేతులు ఎత్తేయడం.. పార్టీ ఫండ్ ఇస్తామన్న వారు డైవర్ట్ చేయడంతో టీడీపీ సూళ్లూరు పేటలో సెల్ఫ్ గోల్ వేసుకొని డీలాపడిపోయింది.  టీడీపీ అసమ్మతి - అసమర్థ నేతను వైసీపీ క్యాష్ చేసుకుంది. నేతలంతా ఉమ్మడిగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని సైతం వైసీపీ వైపు లాగారు.


దీంతో ప్రజలు - నేతలు గంపగుత్తగా సూళ్లూరుపేటలో వైసీపీ వైపు మొగ్గినట్లు సమాచారం.స్థానిక టీడీపీ నాయకుల కారణంగానే తాను వెనుకబడి పోయానని టీడీపీ అభ్యర్థి పరసారత్నం ఎన్నికల ఓటింగ్ అనంతరం వాపోయాడట. ఇలా ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగకముందే సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖరారైందని నేతలు - ప్రజలు - కార్యకర్తలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: