మొన్నటి వరకూ జనసేనను తెగ మోసేసిన చంద్రబాబునాయుడు మీడియా పోలింగ్ తర్వాత పవన్ కల్యాణ్  గెలుపు విషయంలో అయోమయంగా తయారైంది. స్పష్టంగా గెలుస్తాడో లేదో కూడా చెప్పలేకుండా పిచ్చి కథనాలను వండి వారుస్తోంది. ఒకవేళ పవన్ ఓడిపోతే అందుకు ఇవి కారణాలంటూ ముందుగానే కొన్ని హింట్స్ కూడా ఇచ్చింది. మొత్తం కథనం చదివిన తర్వాత పవన్ కచ్చితంగా గెలుస్తాడని మాత్రం చెప్పలేకపోతోంది.

 

 ఆ కథనం ప్రకారం గాజువాకలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం పవన్ కు రాలేదట. మొదటినుండి చాలా అవాంతరాలే ఎదురయ్యాయట. బహిరంగసభ రద్దుకావటం, వడ దెబ్బ తగలటం వంటి సమస్యలు తలెత్తాయట. ఈవిఎంలు మొరాయించిన కారణంగా పవన్ అభిమానులు కూడా ఓట్లు వేయలేకపోయారట. అలాగే ఎండల కారణంగా పవన్ కు ఓట్లేయాలని అనుకున్న వాళ్ళల్లో చాలామంది ఓట్లేయలేకపోయారట.

 

వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి చివరి అవకాశం ఇవ్వమంటూ సెంటిమెంటును రాజేశారట. వయసైపోయిన రీత్యా ఇదే తనకు చివరి అవకాశం అని నాగిరెడ్డి ప్రచారం చేసుకోవటం కూడా కూడా పవన్ కు ఇబ్బందిగా మారిందట. 2009లో ఇండిపెండెంట్ గా 2014లో వైసిపి అభ్యర్ధిగా ఓడిపోవటం కూడా జనాల్లో సానుభూతికి ఓ కారణంగా సదరు మీడియా చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ఎండలన్నది ఒక్క పవన్ అభిమానులకేనా ? ఇతరులకు ఓట్లేయాలని అనుకున్న వారికి చల్లగాను పవన్ అభిమానులకు మాత్రం వేడిగాను ఉంటుందా ?  ఇక ఈవిఎంలు  పవన్ అభిమానులకు ఒకలాగ ఇతరుల విషయంలో మరోలాగ పని చేస్తాయా ?  ఓటర్లు క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం కూడా పవన్ ఓటింగ్ పై వ్యతిరేక ప్రభావం చూపాయని సదరు మీడియా చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా సరే ఓట్లు వేయాలని వచ్చిన వారు క్యూ లైన్లలోనే నిలబడి ఓట్లేయటం మామూలే కదా ?

 

టిడిపి అభ్యర్ధి పల్లా శ్రీనివాస్, వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి స్ధానికులైతే  పవన్ నాన్ లోకల్ అన్న విషయం బాగా జనాల్లో చర్చ జరిగింది. అదే సమయంలో పవన్ ను గెలిపించేందుకు ముఖ్యనేతలే పల్లాను బలిపశువుగా ఉపయోగించుకోవాలని అనుకున్నారట. అందుకు పల్లా ఒప్పుకోకకపోవటంతో పార్టీలోనే ముసలం మొదలైందని సమాచారం. అందుకనే పవన్ కు ఓట్లు వేయటం ఇష్టంలేని టిడిపి శ్రేణులు వైసిపికి ఓట్లేశాయని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. వాస్తవం ఇదైతే చంద్రబాబు మీడియా మాత్రం పవన్ ఓడిపోతే ఇవి కారణాలంటూ మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: