ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. జనాలు తండోపతండోలుగా బయటికొచ్చి రాత్రి అర్ధరాత్రి వరకు ఓటువేయడం ఒక సంచలనం అని చెప్పాలి. అయితే వైసీపీ లెక్క ప్రకారం ఆ పార్టీకి 120 సీట్లు తగ్గకుండా వస్తాయని అంచనా వేస్తుంది. శ్రీకాకుళం…ఈ జిల్లాలో మొత్తం 10 నియోజ‌క వ‌ర్గాలున్నాయి. ఈ ప‌దిస్థానాల్లో వైసీపీ 5, టీడీపీ 2 గెల‌వ‌నున్నాయి. జ‌న‌సేన మాత్రం ఒక్క సీటుకూడా గెలిచే ప‌రిస్థితులు లేవు. ఇక 3 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. పాత‌ప‌ట్నం, ప‌లాసా, పాల‌కొండ నియోజ‌క వ‌ర్గాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. 


విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని మొత్తం 9 నియోజక వ‌ర్గాల్లో వైసీపీ 2, టీడీపీ2 స్థానాలు గెలుచుకోనున్నాయి. 5 స్థానాల్లో మాత్రం ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. కురుపాం, పార్వ‌తీ పురం, సాలూరు, నెలిమ‌ర్ల‌, విజ‌య‌న‌గ‌రం స్థానాల్లో గెలుపు నువ్వా నేనా అన్న‌ట్లుగా ఫైట్ కొన‌సాగ‌నుంది. విశాఖ మొత్తం 15 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 7, టీడీపీ2, జ‌న‌సేన 1 స్థానాలు గెలుకోనున్నారు. మ‌రో 5 స్థానాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. విశాఖ‌ప‌ట్నం ఈస్ట్‌, విశాఖ ప‌ట్నం సౌత్‌, విశాఖ‌ప‌ట్నం వెస్ట్‌, మాడుగుల‌, పాయ‌క‌రావుపేట నియోజ‌క వ‌ర్గాల్లో బ‌ల‌మైన పోటీ నెల‌కొంది. 


తూర్పుగోదావ‌రి జిల్లాలోని మొత్తం 19 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 7, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 7 స్థానాల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. ప్ర‌త్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రాజోలు, కొత్త‌పేట‌, రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మొత్తం 15 నియోజ‌క వ‌ర్గాల‌కు గాను వైసీపీ 6, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 4 నియోజ‌క వ‌ర్గాల్లో ట‌ఫ్ ఫైట్ కొన‌సాగునుంది. న‌ర్సాపురం, భీమ‌వ‌రం, దెందులూరు, పోల‌వ‌రం స్థానాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. నెల్లూరులో ఉన్న మొత్తం ప‌ది స్థానాల్లో వైసీపీ 9, టీడీపీ 0, జ‌న‌సేన 0. ఒక సీట్‌లో గ‌ట్టి పోటీ నెల‌కొంది. నెల్లూరు సిటీస్థానంలో గ‌ట్టిపోటీ నెల‌కొంది. వైసీపీ అభ్య‌ర్ధి అవిల్ కుమార్‌, మంత్రి నారాయ‌ణ టీడీపీ త‌రుపున పోటీ చేస్తున్నారు.  ఇలా మొత్తం 175 నియోజక వర్గాల్లో తమ పార్టీకి 120 సీట్లు తక్కువ కాకుండా వస్తాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: