ఆల్‌ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్.. ప్రేమలోనూ.. యుద్ధంలోనూ.. గెలవడానికి ఏదైనా చేయొచ్చంటారు.. కానీ అది ఎన్నికల యుద్ధంలో కాదు.. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా.. నిజాయితీగా యుద్ధం జరిగితేనే ప్రజలకు మేలు జరిగేది.. 


ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నికల సిబ్బంది ముసుగులో నారాయణ ఉద్యోగుల ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారని బీజేపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ఆరోపణ కలకలం రేపుతోంది. ఎన్నికల సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు.

కానీ కొన్ని సందర్భాల్లో ప్రైవేటు సిబ్బందిని కూడా తీసుకుంటారు. అందులో భాగంగా ఎన్నికల సిబ్బందికింద నారాయణ ఉద్యోగులను పెద్ద ఎత్తున చొప్పించాలని చంద్రబాబు ప్లాన్ చేశారట. దాన్ని ఎన్నికల సంఘం చివరి నిమిషంలో కనిపెట్టి అడ్డుకుందట. 

ఆ కారణంగానే చంద్రబాబు ఈ సీ పట్ల ఇంత ఫ్రస్టేషన్ చూపిస్తున్నారన్నది బీజేపీ సోషల్ మీడియా ఆరోపణ. ఒకవేళ ఇదే నిజమైతే.. అంత కన్నా అరాచకం, దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇప్పటికే అన్ని వ్యవస్థలనూ చంద్రబాబు మేనేజ్ చేస్తారన్న అపవాదు ఉంది. ఇది నిజమైతే అది మరోసారి రుజువయినట్టే అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: