ప్రశాంత్‌ కిషోర్.. ఈ బీహార్ వాసి.. ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాడు. వైసీపీ అధినేత జగన్‌ను వెనుక ఉండి నడిపించాడు. వైసీపీ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయంలోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది. జగన్ పాదయాత్ర అంతగా సక్సస్ కావడానికి జనంలో జగన్ ఇమేజ్ పెరగడానికి ప్రశాంతి కిషోర్‌ చాలా కృషి చేశారు. 


అందుకే.. ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్‌ కిషోర్‌ను కలిశారు.  హైదరాబాదులోని ఐ క్యాప్ కార్యాలయానికి వెళ్లి పోలింగ్ తీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యులకు జగన్ కృతజ్ఢతలు తెలిపారు. 

ఆ సమయంలో జగన్, ప్రశాంత్ కిశోర్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నా పాదయాత్రను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లారు. ప్రజల్లోకి వెల్లడం వల్ల వైసీపీ అధికారంలోకి వస్తోంది. కష్టపడి పనిచేస్తే 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ జగన్ ప్రశాంత్ కిశోర్ తో అన్నారట.

దీనికి ప్రశాంత్ కిషోర్ బదులిస్తూ... జగన్ ని మిస్టర్ సీఎం అంటూ సంభోదించారట. అంతే కాదు..తన సిబ్బందికి కూడా ఏపీలో అద్భుతమైన పాలన అందించడానికి మన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారంటూ పరిచయం చేశారట. బెస్ట్ సీఎంగా పాలన అందించాలని అని శుభాకాంక్షలు చెప్పారట పీకే. 



మరింత సమాచారం తెలుసుకోండి: