ఏపీలో జరిగిన ఎన్నికలు అలాంటి ఇలాంటివి కావు. పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఎపుడూ లేని విధంగా తెల్లవారు జాము వరకూ కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూనే ఉంది. ఈసారి ఎన్నికల విషయంలో కొన్ని తడబాట్లు, తప్పులు జరిగాయి. అయినా సరే పెద్ద ఎత్తున జనం విరబడి మరీ ఓట్లు వేశారు.

 


గెలుపు విషయంలో అధికార తెలుగుదేశం, విపస్ఖ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి మూడవ పార్టీగా జనంలోకి వచ్చిన జనసేన తమ స్థానం ఏంటి అన్నది ఇపుడు చెబుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఓ చానల్లో మాట్లాడుతూ జనసేనకు కొంత ఇబ్బంది కరమైన పరిస్థితి ఈ ఎన్నికల్లో ఉందని నిజాయతీగా అంగీకరించారు. అదే సమయంలో తమకు సీట్ల  పరంగా ఎన్ని వస్తాయనేదాని కంటే ఓట్ల షేర్ బాగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీకి ఓట్లు పెద్ద ఎత్తున యువత, మహిళలు వేసి సానుకూలంగా స్పందించారని ఆయన విశ్లేషించారు.

 


ఇది శుభ పరిణామమని, ఏపీలో రెండు పెద్ద పార్టీల మధ్య భీకరమైన పోరు సాగినా కూడా కొత్త పార్టీగా జనసేనని జనం రిసీవ్ చేసుకుని ఆదరించడం చూస్తూంటే రానున్న రోజుల్లో తమ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం అర్ధమవుతోంది ఆయన అన్నారు. ఇక ఏపీలో అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోందని, వైసీపీకి ఎడ్జ్ ఉందని ఆయన విశ్లేషించారు. మొత్తానికి జనసేన తన సొంత బలాన్ని కూడగట్టుకుని వచ్చే ఎన్నికల్లో అంటే 2024 నాటికి బలంగా ముందుకు రావాలని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: