ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఎవరు గెలుస్తారన్నది మే 23 వరకూ తెలియదు. అయితే అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ తమదే అధికారమని గట్టిగా చెప్పుకుంటున్నాయి. మరి వైసీపీ అంచనాలు ఆ పార్టీకి ఉంటే టీడీపీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి.

 


ఎట్టి పరిస్థితుల్లో అధికారం తమదేనని టీడీపీ అంటోంది. ఈ ధీమాకు కారణమేంటి. అంటే వారు చెప్పే సమాధానం పసుపు కుంకుమ, పించన్లు, ఈ రెండూ గట్టిగా పనిచేశాయని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత దివాకర్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అద్రుష్టం బాగుందని, ఆయన సుడి తిరిగిందని అంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఓటుకు ఒకసారి వచ్చి వెనక్కి వెళ్లి వారు మళ్ళీ రావడం చూడలేదని చెబుతున్నారు. ఇది కచ్చితంగా అనుకూలమైన ఓటు అంటున్నారు.

 

 

మరో వైపు టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు కూడా గెలుపు తమదేనని చెబుతున్నారు. బలమైన గాలి టీడీపీకి అనుకూలంగా వీచిందని వారు అంటున్నారు.  చంద్రబాబు అయితే సైలెంట్ వేవ్ ఉందని, తమ పార్టీకి 130 సీట్లు రావడం ఖాయమని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ లాజిక్ కి అందని విషయాలు అనేకం ఉన్నాయి. అయిదేళ్ళ పాటు టీడీపీ పాలన జనం చూశారు. ఆ పార్టీయే కావలనుకుంటే అంత కసిగా ఓటింగుకు రావాల్సిన అవసరం ఏముంది. మార్పు కోరే గొంతులే బలంగా ఉంటాయి. అడుగులు కూడా వేగంగా  సాగుతాయి.

 


తెలంగాణాలో చూస్తే పోలింగ్ 60 శాతానికి మించలేదు. అంటే అక్కడ ఎటూ టీయారెస్ సర్కార్ ఉందన్న ఆలోచనతోనే జనం వున్నారని అంటున్నారు. మరి ఏపీలో బాబు ప్రభుత్వాన్ని మార్చాలన్న పట్టుదల ఉంటేనే అది ప్రభంజనం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ ధీమా ఎంతవరకూ ఫలిస్తుందో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: