మొన్న ఏపిలో జరిగిన పోలింగ్ కొన్ని చోట్ట  రణరంగాన్ని తలపించాయి.  పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి..  ఇనుమెట్లలో ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.


ఇనుమెట్ల గ్రామంలో కోడెల పోలింగ్ బూత్ వద్దకు వచ్చే క్రమంలో కొంత మంది అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని, స్పీకర్ పై ఎటాక్ చేశారు.  ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు.  దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 


ఈ నేపథ్యంలో కోడెలపై దాడిని అంబటి రాంబాబు, ఆది నారాయణ ప్రోద్భలంతోనే ఆ దాడి జరిగిందని కోడల తరుపు న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు.  కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు అంటున్నారు.  ఇనిమెట్లలో సోదాలు చేస్తున్న పోలీసులు.  ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.  కాగా, పోలీసులు సోదాలతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్న గ్రామస్తులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: