నలబై ఏళ్ల అనుభవం..డెభ్బై ఏళ్లు నిండిన వయసు, రాజకీయ ఉద్దండ పిండం, అపరచాణక్యుడు, మూర్తీభవించిన సిసలై రాజకీయ నాయకుడు, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ గా కీర్తించబడుతున్న చంద్రబాబు ఈ మద్య ఆయన చేస్తున్న పనులకు ప్రతి ఒక్కరూ విస్తుతపోతున్నారు.  మూడు పర్యాయాలు సీఎం పదవిలో ఉన్న ఆయన వరుసగా సహనం కోల్పోయి మీడియా సాక్షిగా చేస్తున్న వ్యాఖ్యలకు పలువురి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నారు. 

తాజాగా చంద్రబాబుపై బ్రాహ్మణ సంఘం మండిపడుతోంది. బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును  చేశారని..ఇక ఆయన స్థానంలో ఎన్నికల సంఘంలో మరో బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్ గా నియమిస్తే ఆయనను కూడా మీడియా సాక్షిగా ఆన్ రికార్డ్ లో ఎలా పడితే అలా మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దాంతో  బ్రాహ్మణ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను అవమాన పరిచారంటూ..అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ మండిపడ్డారు. తాజాగా ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.  గతంలో కూడా బాబు, తేదేపా లీడర్లు అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: