వైఎస్సార్సీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ట్విట్టర్లో, అటు ప్రత్యక్షంగా కూడా విజయసాయిరెడ్డి తులేగేదూశం సానటకీ కలవరపాటుకు గురయ్యేలా వ్యవహరించారు. పోలింగ్​ పూర్తయిన నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాలని కోరారు. అన్ని స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా సీఈవోకు చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలాగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

 

మరోవైపు ట్విట్టర్లో ఇటు చంద్రబాబుపై అటు ఆయన తనయుడు లోకేష్​పై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘‘లోకేశ్..నాదో చిన్నకోరిక. ఈ పదాలు అపశబ్ధం లేకుండా ఉచ్ఛరించాలి. దేవాన్శ్, బ్రహ్మణి, పురంధ్రేశ్వరి,భువనేశ్వరి, ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ, గుంటూరు, మంగళగిరి, బుద్ధవిగ్రహం,డెంగీ. స్పష్టంగా పలికితే మంగళగిరి పోరులో సగం గెల్చినట్టే. లేదనుకో మీ తండ్రి శాశ్వతంగా అధికారానికి దూరమవుతాడు.”అంటూ లోకేశ్​ను ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ధీమాపైన విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘130 స్థానాల్లో విజయ దుంధుబి మోగిస్తామంటూనే ఈ విమర్శలు, దీనాలాపనలు ఏమిటి చంద్రబాబూ? ఈసీపైన, ప్రభుత్వ యంత్రాంగం పైన నోటికొచ్చినట్టు మాట్లాడటమెందుకు? కాసేపు బ్యాలెట్ పేపర్లు ఉండాలంటాడు. మరికాసేపు టిడిపికేస్తే ఫ్యాన్ గుర్తుకు పోయాయంటాడు. టోటల్ కన్ఫ్యూజన్ స్టేజిలో ఉన్నాడు.”అంటూ మండిపడ్డారు. ‘చంద్రబాబు ప్రస్తుత మానసిక స్థితిని సైకాలజీలో ‘False consensus effect’ అని పిలుస్తారు. ఫలితాలు వెలువడాల్సి ఉన్నా, ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఉందని తనకు తెలుసు.అయినా 130 సీట్లు వస్తాయని, మే 23 తర్వాత మంచి రోజున ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం తనను తాను ఓదార్చుకోవడమే.’ అంటూ విమర్శలు గుప్పించారు.

 

‘‘False consensus effect’ కు లోనైన వ్యక్తి తను అత్యంత ప్రజామోదం ఉన్నవాడిగా భావిస్తాడు.తన వైఫల్యాలను కూడా ప్రజలకే ఆపాదిస్తాడు. తన స్వార్థ పూరిత ఆలోచనలను సమాజం ప్రశ్నించరాదని అనుకొంటాడు. విజయాన్ని సాధించడం తప్ప ఓటమి ఎదురుకాదన్న భ్రమలో బతుకుతుంటాడు. చంద్రబాబూ మీరిప్పుడు అపద్ధర్మ సిఎం అని గుర్తు పెట్టుకోండి. అధికారుల మీద, పోలీసుల మీద రుసురుసలు తగ్గించాలి. ఈ 40 రోజులు తమరు చేయాల్సిన ఘన కార్యాలేమీ లేవు. కరకట్ట పైన విశ్రాంతి తీసుకోండి. ఫలితాలు వెలువడేదాకా ఇసి పర్యవేక్షణ ఉంటుంది.”అంటూ పలు ట్వీట్లలో విజయసాయిరెడ్డి చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: