సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్​ ముగిసి ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో ఆయా రాజకీయ పార్టీల మధ్య విమర్శలు‌‌–ప్రతి విమర్శలు సాగుతున్నాయి. తెలంగాణలో ఈ ట్రెండ్​లో తాజాగా ఆసక్తికర విమర్వలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. తాజాగాబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. తెరాస నాయకులైన తండ్రి–కొడుకులు హిందువులను కించపరిచి..రెచ్చగొట్టి.. హిందువుల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. ఓవైసీని మచ్చిక చేసుకోవడం కోసం హిందువులను అవమానించారని వ్యాఖ్యానించారు.

 

అక్రమ చొరబాటుదారుల మీద కేటీఆర్ అభిప్రాయం దేశ వ్యతిరేక చర్యగా ఉందని లక్ష్మణ్​ మండిపడ్డారు. NRC ని మత కోణంలో చూస్తూ ముస్లింల టార్గెట్ గా బీజేపీ వ్యవహరిస్తోందని ఒవైసీ ప్రాపకం కోసం అపరిపక్వంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ‘అక్రమ చొరబాటు దారులకు మతం రంగు పులుముతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గడ్డి కరుస్తున్నారు. మజ్లీస్ మద్దతుతో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. హిందువులను, సైన్యాన్ని అవమాన పరిచే విదంగా మీ మాటలు ఆక్షేపణీయం. కాశ్మీర్ పండితుల గురుంచి ఏనాడు నోరు విప్పని మీరు NRC కోసం రాజకీయాలు చేస్తున్నారు. ’ అని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయం గా అవతరిస్తుందన్నారు. ఫలితాల తర్వాత.. పెను మార్పులు.. వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘రాజకీయ పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికలను..ఆదరా బాదరాగా చేస్తున్నారు. పార్టీ లో చర్చించి.. పరిషత్ ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటాం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయి.. ఓట్ల శాతం పెరుగుతుంది. నిజామాబాద్​లో బీజేపీ గెలవబోతోంది. దేశం మొత్తం రైతులకు కోపం ఉంటే కేవలం సీఎం బిడ్డ ఎంపీగా ఉన్న చోట మాత్రమే పోటీ చేశారు. దీని అర్థం మీ సర్కార్ నిర్లక్ష్యంపై రైతుల తిరుగుబాటు. బిడ్డ ఓడిపోతోంది అని..మండవ దగ్గర..కి వెళ్ళాడు. పార్లమెంట్ ఫలితాల తరువాత... కేసీఆర్ సచివాలయం బాట పట్టక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: