ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు రావటానికి మరో నలభై రోజులు పడుతుంది. ఇప్పటికే పలు ఛానెల్స్ , పలు సర్వేలు ఇంకా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరి వైపు మొగ్గారని తెలుసుకోవటానికి . అయితే ఎన్నికల వేళ కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ లో బాబును కొట్టే వారు లేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పోల్ మాస్టర్ ను దెబ్బేయటం అంటే మామూలు కాదు. కానీ.. ఆ రికార్డు జగన్ పేరిట నమోదు కావటం ఖాయమన్న మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.


ఎందుకిలా?  ఎక్కడ తప్పు జరిగింది? బాబు ఎక్కడ దెబ్బ తిన్నారు?  అన్నవి ప్రశ్నలుగా మారాయి.ఏపీలో జరిగిన పోలింగ్ ను చూస్తే.. బాబు బ్యాచ్ చేసిన తప్పులు చంద్రబాబుకు శాపంగా మారనన్నట్లు చెబుతున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లో బాబు దిట్టే అయినప్పటికీ.. ఈసారి నలువైపుల నుంచి వెల్లువెత్తిన ఒత్తిళ్లలో నలిగిన బాబు.. సరిగా ప్లాన్ చేయలేకపోయారని చెబుతున్నారు.ఇక.. ఆయన వేసిన వ్యూహాన్ని అమలు చేసే విషయంలోనూ తెలుగు తమ్ముళ్లు అంత శ్రద్ధగా లేరని చెబుతున్నారు.


తమ అధినేత అమలు చేసిన పసుపుకుంకుమ..రైతురుణ మాఫీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయన్న అతి విశ్వాసం టీడీపీని కొంప ముంచటం ఖాయమంటున్నారు.2014లో జగన్ లోనూ.. జగన్ బ్యాచ్ లో కనిపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఈసారి బాబులోనూ.. బాబు బ్యాచ్ లోనూ కనిపించినందన్న మాట వినిపిస్తోంది. ఇదే.. బాబును ముంచేయనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది మే 23 నాటికి కానీ తేలదు. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: