పచ్చవాతం కమ్మిన పచ్చ నాయకులు పచ్చపత్రికలు ఎన్ని మాట్లాడినా ఎంత రాసినా మే నెల 23వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడటం తధ్యం. అంతవరకే ఎవరెన్ని మాట్లాడినా ఎంత ధ్వని కాలుష్యం సృష్టించినా! 

ఒక విద్యార్ధి పరీక్షలు రాస్తాడు. ఫలితాలకోసం నిరీక్షించే క్రమంలో తనపై తనకు నమ్మకం ఉంటే హాయిగా కాలాన్ని అద్భుత్వంగా ఆస్వాదిస్తాడు అనందంలో గడుపుతాడు. 
తనపై తనకు నమ్మకం లేనివారు రానున్న ఉపద్రవాన్ని ఊహించి కారణాల కోసం వెదుకుతూ ఉంటారు. పరీక్షలప్పుడు కరంటు లేదనో, ఎండలు మెండుగా ఉండటంతో ఆ ఉక్కపోత భరించలేక పోయాననో? పెన్ను సరిగా రాయలేదనో? చదివేటప్పుడు ఇంట్లో ఏకాగ్రత కుదరలే దనో? కారణాలు వెతికి వాటిపై తమ వైఫల్యాన్ని నెట్టేసి బ్రతికేస్తాడు. 

తన ఓటమికి కారణం ఎన్నికలసంఘం అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పేశారని అందరికీ అర్ధం అవుతూనే ఉంది. అంటే చంద్రబాబు తెలుగుదేశం మానసికంగా ఓటమి అంగీకరించినట్లే.  అసలు మనకు ప్రజల్లో ఆదరాభిమానాలు, విశ్వాసం ఉంటేఎన్నికల సంఘం, ఈ కేంద్రప్రభుత్వం, దాని సంస్థలు పీకేదేమీ లేదు. 

అయితే ఆయన గెలుపోటములకు ఏవరూ కార్యకారణం కాదు. ప్రజలు నమ్మి ఆయన అనుభవంపై విశ్వాసముంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరన్న ప్రాతిపదికన నాటి స్నేహితులు మోడీ-పవన్ లను చూసి జనం ఓట్లేసి గెలిపించారు. ఆ సంధర్భంలో చేసిన 600పైగా వాగ్ధానాలు వాటి సమాచారం తెలుగుదేశం వెబ్సైట్లో నుంచి తీసి వేసిన నాడే ఆయన వాగ్ధానాలకు తిలోదకాలిచ్చారని తేటతెల్లమైంది. ప్రజలు ఆయన నుండి జిమ్మిక్స్ కోరుకోలేదు. తక్కువ అభివృద్ధి చేసినా మన్నించే వారే.  
Image result for chandrababu feels ballot as bullet
*అమరావతి విశ్వనగర నిర్మాణంలో సినీ దిగ్ధర్శకుడు "రాజమౌళి" తో ప్లాన్స్ గీయించటం ప్రారంభించిన రోజే – అమరావతి 70 ఎంఎం వెండితెరపై సినిమా లాగా కలలా ఇలలో  కరిగిపోతుందని తెలివైన తెలుగువారికి అర్ధమైంది. 

*నాలుగేళ్ళు స్నెహం చేసిన రోజుల్లో బిజేపితో ఆయన -అవకాశవాదం స్వార్ధపరత్వం ప్రామాణిక ములాల మీద మైత్రి సౌధం నిర్మించబడుతుందని జనం గుర్తించారు. నాడు నరేంద్ర మోడీని ఆయన ఆకాశానికెత్తిన తీరు వర్ణనాతీతం.

*పొలవరం కానివ్వండి మరేదైనా కానివాండి కేంద్ర నిర్వహణలో జరగాల్సిన పనులు తాన చేతిలోకి తీసుకున్నరంటేనే "కమీషన్ల పర్వం" తెరలేచిందని అందరికీ తెలుసు. 

*సచివాలయం నిర్మాణం కోసం భూమి, మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే యివ్వగా - తరవాత ఉత్త నిర్మాణానికి చదరపు అడుగుకు ₹10000/- ఖర్చు చేసిన తరుణంలో గుత్తేదార్లెవరో తెలిసిన వెంటనే జనం గుండేల్లో ప్రజాధనానికి రెక్కలొచ్చాయనేది టక్కున తెలిసి పోయింది.
Image result for chandrababu vengeance on election commission
*ప్రభుత్వం చేతుల్లో పదిలంగా సంపూర్ణ రక్షణలో ఉండాల్సిన ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమాచారం (పబ్లిక్ డేటా) స్వంత సామాజిక వర్గ ప్రయివేట్ సంస్థ చేతిలోకి చేర్చి - జన సమాచారం తన పార్టీ ప్రయోజనాలకు మాయోపాయాలు, మతలబులతో ఎన్నికల్లో గెలవటానికి కపటోపాయం రూపుదిద్ధింది తెలుగుదేశం అధినేతలని జనం తెలుసు కున్నారు. అంటే తమ సమాచారం మాత్రమే కాదు ఈ ప్రభుత్వం చేతిలో తమ జీవితాలుంటే బధ్రత కూడా ఇంతేనని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు. 

*కేంద్రసహాయం పొంది రాష్ట్రప్రభుత్వం దానికి లెక్కలు చెప్పవలసిన అవసరం లేదన్నప్పుడే అక్కడ ప్రజాధనం "గుటకాయస్వాహా" అయిందని ప్రజలకు అర్ధమైంది. 

*రాష్ట్రంలో కేంద్ర నిఘా, విచారణ సంస్థలకు ప్రవేశం నిషేధించిన నాడే అవినీతి తారస్థాయికి చేరిందని తెలిసిపోయింది.

*రెవెన్యూ అధికారిణి వనజాక్షి గారిపై దాడి ధౌర్జన్యంతో మహిళలకు, మహిళాధికారులను  తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఎలా హింసించారో జనాలకు తేటతెల్లం అయి పోయింది. 
Image result for vanajakshi & roja
*తెలుగుదేశం పాలనలో మహిళా సాధికారత అనేది నేతి బీరకాయలో నెయ్యేనని విపక్ష శాసన సభ్యురాలు రోజా పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరే ఋజువు చేసింది. 

*మత సామరస్యం అనేది ఏపిలో ఎండమావే అనేది విజయవాడలో జరిగిన దేవాలయాలు, మసీదులు, చర్చీల కూల్చివేతల నాటి నుండే అర్ధమౌతుంది.    

*కేంద్రం ఇచ్చిన అగ్రకుల రిజర్వేషణ్లలో సగం కాపు సామాజిక వర్గానికి  కేటాయించటంతో అగ్ర కులాలకు కాపులకు మద్య కులాల కుంపట్లు రగులుకున్నాయి. టిడిపి తొలి ఐదేళ్ళ పాలనలో ఒక్క కమ్మ కులం తప్ప, ఆ కుల మీడియా తప్ప, బాగుపడిన ఇతర కులాలే లేవు. ఇంతగా కులాల మీద కార్పణ్యం పెంచుకున్న రాజకీయ నాయకుడు వెరెవరూ లేరంటే ఆశ్చర్యం లేదు. 

*పచ్చమీడియాకు, తమ పచ్చ సామాజిక వర్గ జనాలకు తప్ప, చంద్రబాబు ఎవరికి మేలు చేశాడో? ఎవరితో చెలిమి చేశారో? జనాలకు అంతా అనుమానాస్పదమే. 
Image result for vanajakshi & roja suffered from TDP
ఇలాంటి వందల కారణాలతో జనం కసితో ఎన్నికల్లో ఓట్లు వేశారు. కాబట్టే చంద్రబాబు గుండెల్లో – అసలు బాలెట్టే బుల్లెట్ లాగా దిగిపోగా తన దేశవ్యాప్త ప్రతిపక్ష మిత్రులతో చెప్పుకొని స్వాంతన పొందటానికి డిల్లీ చెక్కేశారు మరో రెండు కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేయటానికి.  ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే దానికి కారణం రాష్ట్ర ఎన్నికల సంఘం దానికి నేపధ్యంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాతమే అని జనం డిసైడ్ అయిపోయారు. దాన్నే చంద్రబాబు రానున్న ఐదేళ్లూ ప్రచారాస్త్రంగా వాడేయ బోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: