చంద్రబాబు గత కొన్ని రోజులుగా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వ్యవస్థల మీద బాగా పెద్ద నోరు చేసుకుంటున్నారు. వారూ వీరు అన్నది చూడకుండా అందరినీ ఒకే గాటన కట్టేసి పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అదిపుడు ఎటు తిరిగి ఏ వైపునకు చుట్టుకుంటుందో మరి. అసలే బాబు గారు రోజులు బాగులేవు.

 

 

ఇదిలా ఉండగా  చంద్రబాబు నాయుడుపై ఎన్నికల సంఘం తక్షణమే కేసు పెట్టాలని, క్రిమినల్‌ కేసుతో పాటు పరువు నష్టం దావా వేయాలని విశాఖకు చెందిన  రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కోరారు. చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రొజు  ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమించిన అధికారిని కోవర్ట్‌ అంటారా అని ప్రశ్నించారు. చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

 

 

అధికారులంతా చెప్పుచేతల్లో ఉండాలన్నది చంద్రబాబు భావనలా ఉందన్నారు. రాజ్యాంగం ఈసీకి ఇచ్చిన హక్కును చంద్రబాబు ఎలా తప్పుబడతారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలన్నారు. ఈఏఎస్‌ శర్మ లాంటి మేధావులు బాబు చేస్తున్న తప్పులను ఒక్కోటి లెక్క పెడుతున్నారు. ఆయన వాచలత్వాన్ని కూడా వారు గమనిస్తున్నారు. బాబు ఈ రకంగా దూకుడుగా ముందుకు వెళ్తే మాత్రం ఆయన మీద కేసులు పెట్టేందుకు కూడా మేధావులు  ఆలోచించరని  అంటు న్నారు.. మరి బాబు గారు ఇప్పటికైనా సరిదిద్దుకుంటారో లేదో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: