ఏపీలో రాజకీయాలు మరికొద్ది నెలల్లో వేగంగా మారబోతున్నాయి. ఎన్నికలు ముగిసాయి. వచ్చే నెలలో ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు తర్వాత అంతా భావిస్తున్నట్లుగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే మాత్రం చాలా జరిగేలా కనిపిస్తోంది. చంద్రబాబు వంటి రాజకీయ ఉద్దండ పిండం ఏపీలో కీలకంగా ఉన్న వేళ ఏం జరగబోతోంది.

 


జగన్ ముఖ్యమంత్రి అన్నట్లుగా ఇప్పటికే దాదాపుగా అంతా ఓ అంగీ కారానికి వచ్చేశారు. అంతా ఏంటి ఏకంగా చంద్రబాబు నాయుడే ఓటమి సంకే తాలు ఇస్తున్నారు. ఇక జగన్ సీఎం అయితే బాబు ఎటూ ప్రతిపక్షంలో ఉంటారు. నిజానికి ఏడాదిన్నర కాలంగా బాబు పోషిస్తున్న పాత్ర కూడా అదే ఎపుడైతే కేంద్రంతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చారో అప్పటి నుంచి బాబు ప్రతిపక్షం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు మీదనే ఆయన గత ఏడాదంతా గడిపారు తప్ప పాలన జోలికి పోలేదన్న విమర్శలు ఉన్నాయి.

 


ఇక ఇపుడు కేంద్రం, మోడీ, కేసీయార్లతో పాటు ఈసీ కూడా తోడు చేసుకున్నారు. అంటే బాబు పోలింగుకు ఒక రోజు ముందే విపక్ష అవతారం ఎత్తేశారు. ఈ దూకుడు బాబు మరింతగా చూపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున జగన్ ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో ఆయన్ని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా కూర్చోనీయకుండా బాబు చేస్తారని ఇప్పటికే తేలిపోయింది. జగన్ని ఇక అనుక్షణం బాబు వెంటాడుతూనే ఉంటారు. ఆయన అనుకూల మీడియా ఎటూ ఉంది. అందువల్ల బాబు వంటి సీనియర్ తో ఎలా వుండాలో, ఆయన విపక్ష వ్యూ హాలను ఎలా ఎదుర్కోవాలో కూడా జగన్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మంచిదని సెటైర్లు పడుతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: