ఎన్నికలు అయిపోయిన .. చంద్రబాబు ఇంకా ఈవీఎంల గురించి పట్టుకొని వేలాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలా ఈవీఎంల గురించి మాట్లాడటం ఓటమిని ఒప్పుకోవటమేనని స్వయంగా తెలుగు తమ్ములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అర్థంలేని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రేపు ఎన్నికల్లో ఓడిపోయాకా.. తాము ఈవీఎంల వల్ల ఓడినట్టుగా చెప్పి ఉంటే అదో లెక్క. ఎందుకంటే ఆయనకు ఇవేమీ కొత్త కాదు. రెండువేల నాలుగులో ఇలాగే ఈవీఎంల మీద నింద వేశారు. బీజేపీతో జతకట్టడం పొరపాటు అయ్యిందన్నారు. ఇక రెండువేల తొమ్మిదిలో తమ ఓటమికి నిందను తన మిత్రపక్షాల మీద, చిరంజీవి మీద నెట్టారు.  


అప్పుడంతా.. చంద్రబాబు నాయుడు ఓడిపోయాకా ఆ మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు  మాత్రం ఫలితాలు రాక ముందే బాబు ఓటమికి సాకులను చెబుతూ ఉన్నారు. అసంబద్ధమైన వాదనలతో బాబు చెలరేగిపోతూ ఉన్నారు. వాటినిచూసి సామాన్యుల తమ ఆలోచన మేరకు స్పందిస్తున్నారు. చంద్రబాబు మరి సిల్లీగా మాట్లాడుతున్నారనే మాట కాస్త ఆలోచన పరుల నుంచి వినిపిస్తూ ఉంది. బాబు వీరాభిమానులు మాత్రం ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటున్నారు కానీ, ఇదే సమయంలో వారిలో ఆందోళన రేగుతూ ఉంది.


ఫలితాల రోజున కథ తేడాకొట్టేలా ఉందని, అందుకే బాబు ఇలాంటి వాదనలను రెడీ చేశారని.. ఓటమికి నెపాన్ని ఈవీఎంల మీద నెట్టేసేందుకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలే  తమలో తాము అనుకుంటున్నారు. పోలింగ్ రోజున కూడా తమ గెలుపు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉండిన టీడీపీ వీరాభిమానులు.. తీరా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను విని.. ఓటమి తప్పదేమో అనే అభిప్రాయాలకు  వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: