చంద్రబాబు ఢిల్లీలో నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈసీ మీద నిప్పులు చెరిగారు. ఏపీలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా చేయడం ప్రజస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని అనేశారు. మొత్తానికి చంద్రబాబు ఏపీలో పరిణామాలన్నింటికీ కారణం ఈసీ అని ఓ బండ పడెశారు.

 


అంతవరకూ బాగానే ఉంది కానీ అసలు పోలింగ్ ముందు రోజు నుంచి వరసగా నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఇంతలా ఎందుకు గొంతు చించుకుంటున్నారన్న సందేహం ఏపీలోనే కాదు, డిల్లీ మీడియాకు కలిగింది ఓ విలేకరి బాబుని అదే అడిగారు. మీరు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారు. ఓడిపోతారని భయమా అని డైరెక్ట్ గానే ప్రశ్నించాడు. దానికి బాబు ఇచ్చిన సమాధానం చాలా వింతగా ఉంది.

 


మరి ఏపీలో ఈవీఎం ల పనితీరు మీద నోరు మెదపని వైసీపీ సంగతేంటి, మౌనం వహించిన జగన్ విషయమేంటని అదే విలేకరిని బాబు ఎదురు ప్రశ్నిచారట. అంటే తాను ఓడిపోతున్నానని చెప్పకనే బాబు చెప్పేసి గెలిచే అవకాశాలున్న జగన్ ఈవీఎం ల లోపాల మీద ఆధారపడ్డారా అంటూ తెలివిగా ప్రశ్న వేశానని బాబు అనుకున్నారు కానీ. ఇందులోనే లాజిక్ మిస్ అయింది అంటున్నారు. బాబు జగన్ విషయం తెచ్చి తన ఓటమిని చెప్పకనే చెప్పేశారని అక్కడ ఉన్న మొత్తం మీడియాకు  అది అర్ధమైపోయిందని అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: