చంద్రబాబుకు ఈవీఎంలకు అవినాభావ సంబంధం ఉంది. బాబు రాజకీయ జీవితంలో ఈవీఎంల పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. భారత దేశం చాలా వేగంగా అభివ్రుధ్ధిని సాధిస్తున్న వేళ అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈవీఎంలు ప్రవేశపెట్టారు. నాడు పోలింగ్ కు బ్యాలెట్ పేపర్ని ఉపయోగించేవారు. ఎన్నికల్లో మోసాలని అరికట్టడానికి ఈవీఎంలు తీసుకువచ్చారు.

 


చంద్రబాబు అన్న గారి నుంచి అధికారం తీసుకుని ఒక టెర్మ్ సీఎం అయ్యాక 1999లో వాజ్ పేయ్ వేవ్ లో రెండవమారు గెలిచారు. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈవీఎం లను తొలి సారి ఉపయోగించారు. ప్రయోగాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో బాబు బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల సమయంలో విపక్షాలు ఏవీ ఈవీఎం ల పని తీరుని తప్పుపట్టలేదు. బాబు అయితే మంచి హుషార్ గా ఉన్నారు కూడా.

 

మరి అదే ఈవీఎం లను పూర్తిగా ఉపయోగించి 2004 అసెంబ్లీ ఎన్నికలను జరిపించారు. అపుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పెద్ద ఎత్తున సీట్లను గెలుచుకుంది. అపుడు మొదటి సారి ఈవీఎం లకు వ్యతిరేకంగా బాబు గొంతు బయటకు వచ్చింది. ఆయన అప్పటికే టెక్నాలజీకి మూల పురుషున్ని అని ప్రచారం బాగా చేసుకుని ఉన్న సమయమది. అయినా తన ఓటమిని తట్టుకోలేక ఈవీఎం లను బాబు విమర్శించారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్ళీ బాబు రెండవసారి ఓడిపోయారు.

 


ఈసారి ఆయన ఈవీఎంల కంటే కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవిని గట్టిగా విమర్శించారు. ఆయన రావడం వల్ల ఓట్లు చీలి తాను ఓటమి పాలు అయ్యానని అనేక సందర్భా ల్లో  బాబు చెప్పుకొచ్చారు. ఇక 2014 ఎన్నికల నాటికి బాబు, మోడీ, పవన్ కలసి పోటీ చేశారు. ఈసారి విజయలక్ష్మి చంద్రబాబుని వరించింది. దాంతో బాబు ఈవీఎంలను ఒక్క మాట కూడా అనలేదు. ఆల్ హ్యపీస్ అన్న తీరులో ఆయన ఉన్నారు. ఇపుడు 2017ల్ ఆగస్టులో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఈవీఎంలను ఉపయోగించారు. టీడీపీ అభ్యర్ధి 27 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి అపుడు కూడా బాబుకు ఈవీఎంలు ముద్దు అయ్యాయి.



ఇక 2019 ఎన్నికలు జరిగాయి. ఇంకా ఫలితాలు రాలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఈవీఎంలను తప్పు పడుతున్నారు. నిజానికి ఈవీఎం లతో ఎన్నికలు జరిగినపుడు ఒక్క 2009 లో తప్ప మిగిలిన అన్ని సార్లు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఈవీఎంల ను ట్యాంపరింగ్ చేయాలనుకున్నా విపక్షాలకు కుదిరే వ్యవహారం కాదు. అన్నీ తెలిసి కూడా బాబు ఈవీఎంలను ఈసారి కూడా నిందిస్తున్నారు. మరి ఫలితాలు ఆయనకు ముందే తె లుస్తున్నాయా. లేక కారణాలు వెతుక్కుని దగ్గర పెట్టుకుంటున్నారా. బాబే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: