రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం అనేక మలుపులు, వివాదాలు, ఘర్షణల నడుమ కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం అన్నట్టుగా ముగిసింది. గత ఎన్నికలకు భిన్నం గా ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. మొత్తంగా 80% మేర పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో మహిళా ఓటింగ్‌ పెరగడం, పురుష ఓట్లు తగ్గడం గమ నార్హం. అయితే, ఈ పరిణామాన్ని రెండు ప్రధాన పార్టీలు కూడా తమకు సానుకూలంగానే తీసుకోవడం గమనార్హం. మహిళా ఓటు బ్యాంకు తమకు అనుకూలమని, పసుపు-కుంకుమ పథకం తమను గట్టెక్కిస్తుందని టీడీపీ చెబుతోంది. అయితే, వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని, దీనివల్ల తాము లాభిస్తామని అంచ నాలు వేస్తోంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేసుకుంటోంది. అయితే, ఎవరు ఎలాంటి అంచనాలు వేసుకుని ముందుకు సాగినా కూడా తుది ఫలితం కోసం మే 23 వరకు వెయిట్‌ చేయకతప్పదు. 


ఇక, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చెబుతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం. ఏపీని పాలించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న జగన్‌.. గత ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను రాబట్టి ఈ దఫా.. గెలుపుగుర్రం ఎక్కాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర ఇక్కడ కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. అదేసమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని ఇక్కడ వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ అంచనాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో.. ఈ దఫా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. వాస్తవానికి తూర్పుగోదావరి అంటేనే టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి గతంలో యనమల రామకృష్ణుడు వంటి హేమా హేమీలు టీడీపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం ప్రజలు తమవెంటే ఉన్నారని వైసీపీ అంచనాలు కడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, సమస్యలు పట్టించుకోక పోవడం వంటివి తమకు అనుకూలంగా మారాయని వైసీపీ చెబుతోంది. 


వైసీపీ అంచనాల ప్రకారం.. మొత్తం 19 సీట్లలో టైట్‌ ఫైట్‌ మధ్య 8 స్థానాల్లో టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో వైసీపీ విజయం సాధించ డం ఖాయమని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తూర్పులో టీడీపీ విజయదుందుభి మోగించింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 13 స్థానాల నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కగా, వైసీపీ  5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక, బీజేపీ ఒక స్థానంలో గెలించింది. వైసీపీ వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్‌ టీడీపీ నువ్వా-నేనా? అనే రేంజ్‌లో ఫైట్‌ సాగుతుందని చెబుతున్నారు. మారిన అంచనాల నేపథ్యం, పెరిగిన మహిళా ఓటు బ్యాంకు వంటి రీజన్ల నేపథ్యంలో వైసీపీ విజయం ఖాయమని ఈ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. 


కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. గెలుపు మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇక, నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. తుని, అనపర్తి, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం, గరగవరం, రంపచోడవరం, జగ్గంపేటల్లో వైసీపీ ఫ్యాన్‌ జోరు పెరిగిందని, గెలుపు ఖాయమని ఈ పార్టీ నాయకులు అంచనాకు వచ్చారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో గెలుచుకున్న కొన్ని స్థానాలను నిలబెట్టుకుంది. వీటిలో రాజమండ్రి రూరల్‌, సిటీ(గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది), పెద్దాపురం, కాకినాడ రూరల్‌, రాజోలు, మండపేట, రాజానగరం, రామచంద్రాపురంలో సైకిల్‌ విజృంబించడం ఖాయమని వైసీపీ లెక్కలు తేల్చింది. అదే టైంలో జ‌న‌సేన సైతం రాజోలు, పి.గన్న‌వ‌రం, తుని, పిఠాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్‌, కాకినాడ రూర‌ల్‌, కొత్త‌పేట, కాకినాడ సిటీ లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని చోట్ల గెలిచి, కొన్ని చోట్ల గ‌ట్టి పోటీ ఇస్తామ‌న్న ఆశ‌తో ఉంది. అయితే, వీటిలో ఎన్ని నిజమవుతాయనే విషయం మే 23 వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: